Breaking News

పాకిస్తాన్ కెప్టెన్‌ను ట్రోల్ చేసిన ఇషాన్ కిష‌న్‌.. వీడియో వైరల్

Published on Thu, 03/27/2025 - 17:05

భారత మాజీ అంపైర్ అనిల్ చౌదరి.. ఇప్పుడు కామెంటేట‌ర్‌గా స‌రికొత్త అవ‌తార‌మెత్తాడు. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో హర్యాన్వి బాష‌లో చౌదరి వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే అనిల్ చౌదరి తాజాగా టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌తో త‌ను మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. 

ఈ వీడియోలో చౌద‌రి, కిష‌న్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ప్రస్తుతం చ‌ర్చానీయంశమైంది. అందుకు కార‌ణం పాకిస్తాన్ కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌ను కిష‌న్ విమ‌ర్శించ‌డ‌మే. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ప‌దే ప‌దే వికెట్ల వెన‌క అప్పీల్ చేయ‌డాన్ని కిష‌న్ ట్రోల్‌ చేశాడు.

అస‌లేం జ‌రిగిందంటే?
అంపైర్ అనిల్ చౌద‌రి: కిష‌న్.. నువ్వు ఆడిన చాలా మ్యాచ్‌ల్లో నేను అంపైర్‌గా వ్య‌వ‌హ‌రించాను. ఇప్పుడు నీవు చాలా పరిణితి చెందిన ఆట‌గాడిగా మారావు. గ‌తంలో వికెట్ కీపింగ్ చేసే ప‌దే ప‌దే అప్పీల్ చేసి అంపైర్‌లు చిరాకు తెప్పించేవాడివి. కానీ ఇప్పుడు మాత్రం అవ‌స‌ర‌మైనప్పుడు మాత్ర‌మే అప్పీలు చేస్తున్నావు. ఈ మార్పు నీలో ఎలా వ‌చ్చింది?

ఇషాన్ కిష‌న్:  ఇప్పుడు అంపైర్‌లు చాలా తెలివిగా ఉన్నారు. మనం ప్రతిసారీ అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్‌కు కూడా నాటౌట్ ఇస్తాడు. అంపైర్‌లకు వారి తీసుకున్న నిర్ణ‌యాల‌పై న‌మ్మ‌కం ఉండాలంటే  సరైన సమయంలో అప్పీల్ చేస్తే బెట‌ర్. లేక‌పోతే మ‌హ్మ‌ద్ రిజ్వాన్ లాగా ప‌ద‌పదే అప్పీల్ చేస్తే.. అంపైర్లు ఒక్కొసారి ఔటైనా కూడా నాటౌట్ ఇస్తార‌ని కిష‌న్ ఫ‌న్నీగా స‌మాధ‌న‌మిచ్చాడు. 

ఈ సంద‌ర్భంగా అంపైరింగ్ కోసం కిష‌న్ మాట్లాడాడు. కొత్తగా వచ్చే అంపైర్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత నమ్మకంగా ఉండాలని కిష‌న్ పేర్కొన్నాడు. కాగా ఈ జార్ఖండ్ డైన్‌మేట్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీతో మెరిశాడు.  రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే దేశ‌వాళీ క్రికెట్‌, ఫ్రాంచైజీ లీగ్‌ల‌లో దుమ్ములేపుతున్న కిష‌న్.. జాతీయ జ‌ట్టుకు మాత్రం గ‌త కొంత కాలంగా దూరంగా ఉన్నాడు.
చ‌ద‌వండి: టిమ్‌ సీఫర్ట్‌ ప్రపంచ రికార్డు.. పాక్‌పై చితక్కొట్టి అరుదైన ఘనత
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)