Breaking News

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా ఓపెనర్‌..

Published on Mon, 02/19/2024 - 07:03

టీమిండియా ఓపెనర్‌, విధర్బ మాజీ కెప్టెన్‌ ఫైజ్ ఫజల్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఫైజ్ ఫజల్ తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఫైజ్ ఫజల్ వెల్లడించాడు.

"విదర్భ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. గత 21 ఏళ్లగా విదర్భ క్రికెట్‌తో ఎన్నో మధురమైన జ్ణాపకాలు ఉన్నాయి. నా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ప్రయాణం ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే ముగించాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకున్నది కాదు.

కానీ నా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ముందుకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని భావించాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిని సహచరులు, కోచ్‌లు, ఫిజియోలు, ఫ్యామిలీ, అభిమానులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఫజల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

ఫైజ్ ఫజల్ 2003లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే జమ్మూ కాశ్మీర్‌పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 137 మ్యాచ్‌లు ఆడిన ఫజల్‌.. 24 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. అదే విధంగా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 113 మ్యాచ్‌లు ఆడిన అతడు 3,641 పరుగులు చేశాడు.

ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోని సారథ్యంలో భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫైజ్‌..  తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. అయతే దురదృష్టవశాత్తూ తర్వాత అతడికి జాతీయ జట్టు తరపున ఆడే అవకాశం మళ్లీ రాలేదు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)