Breaking News

Asian Athletics Championships: జ్యోతికి రజతం... జ్యోతికశ్రీకి కాంస్యం

Published on Mon, 07/17/2023 - 07:19

బ్యాంకాక్‌: ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తమ రెండో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 2017లో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌ అత్యధికంగా 29 పతకాలతో అగ్రస్థానంలో నిలువగా... 1989, 1985 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 22 పతకాల చొప్పున సాధించింది.  

చివరిరోజు ఆదివారం భారత అథ్లెట్లు 13 పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు జ్యోతి యర్రాజీ రజతం, దండి జ్యోతికశ్రీ కాంస్య పతకం సాధించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన జ్యోతి యర్రాజీ 200 మీటర్ల విభాగంలో రజతం గెలిచింది.

విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 23.13 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది.  మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో దండి జ్యోతికశ్రీ, హీనా మలిక్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్‌ బృందానికి కాంస్య పతకం దక్కింది. జ్యోతికశ్రీ బృందం 3 నిమిషాల 33.73 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో అమోజ్‌ జేకబ్, అజ్మల్, మిజో కురియన్, రాజేశ్‌లతో కూడిన భారత బృందం (3ని:01.80 సెకన్లు) రజతం సాధించింది.

మహిళల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో అభా ఖతువా (భారత్‌) ఇనుప గుండును 18.06 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం గెలిచింది. మహిళల 5000 మీటర్ల రేసులో పారుల్‌ చౌదరీ (15ని:52.35 సెకన్లు) రజతం, అంకిత (16ని:03.33 సెకన్లు) కాంస్యం నెగ్గారు. పురుషుల 5000 మీటర్ల విభాగంలో గుల్‌వీర్‌ సింగ్‌ (13ని:48.33 సెకన్లు) కాంస్యం సాధించాడు.

పురుషుల జావెలిన్‌ త్రోలో డీపీ మనూ (81.01 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. పురుషుల 800 మీటర్లలో కిషన్‌ కుమార్‌ (1ని:45.88 సెకన్లు), మహిళల 800 మీటర్లలో కేఎం చందా (2ని:01.58 సెకన్లు) రజత పతకాలు నెగ్గారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో వికాశ్‌ సింగ్‌ (1గం:29ని:32 సెకన్లు) కాంస్యం, మహిళల 20 కిలోమీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి (1గం:34ని:24 సెకన్లు) రజతం గెలిచారు.    

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)