Breaking News

ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన భారత్‌.. రెండు పతకాలు ఖాయం

Published on Sat, 09/06/2025 - 20:23

సౌత్ కొరియా వేదిక‌గా జ‌రుగుతున్న ఆర్చ‌రీ ఛాంపియ‌న్ షిప్‌-2025లో భార‌త ఆర్చ‌ర్లు స‌త్తాచాటారు. ఈ మెగా ఈవెంట్‌లో భార‌త్‌కు రెండు ప‌త‌కాలు ఖాయ‌మ‌య్యాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలో కూడిన భార‌త పురుష‌ల జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.

తొలి రౌండ్‌లో భారత బృందానికి బై ల‌భించ‌డంతో నేరుగా రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఈ క్ర‌మంలో సెకెండ్ రౌండ్‌లో ఇండియ‌న్ టీమ్‌కు ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ ఎదురైంది. నిర్ణీత స‌మ‌యంలో రెండు జట్ల పాయింట్లు 232-232 సమం కావడంతో షూట్‌-ఆఫ్ నిర్వహించారు. షూట్‌-ఆఫ్‌లో 30-28 తేడాతో భారత్ విజయం సాధించింది. 

అనంతరం క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో యూఎస్‌పై (234-233) ఒక్క పాయింట్ తేడాతో భారత్ గెలుపొందింది. క్వార్టర్స్‌లో భారత్ ఆరంభం నుంచి వెనకబడి ఉన్నప్పటికి ఆఖరిలో ఆర్చ‌ర్లు అద్భుతాలు చేయ‌డంతో యూఎస్‌పై పైచేయి సాధించింది.

ఇక సెమీఫైనల్లో  మూడవ సీడ్ టర్కీ(234-232 )ని రెండు పాయింట్ల తేడాతో ఓడించి తమ ఫైనల్ బెర్త్‌ను టీమిండియా ఖారారు చేసుకుంది. ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ను భారత్ బృం‍దం ఎదుర్కొనుంది. భారత్ ఫైనల్ చేరడంలో రిషబ్ యాదవ్‌ది కీలక పాత్ర. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో 709 పాయింట్లతో భార‌త త‌ర‌పున టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన రిష‌బ్‌.. క్వార్టర్స్‌, సెమీస్‌లోనూ స‌త్తాచాటాడు.

ఆ త‌ర్వాత రిష‌బ్ యాద‌వ్.. వెన్నం జ్యోతీ సురేఖ‌తో క‌లిసి కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భార‌త్‌ను ఫైన‌ల్‌కు చేర్చాడు. సెమీఫైన‌ల్లో చైనీస్ తైపీపై 157-155 పాయింట్ల‌తో తేడాతో ఈ భార‌త ద్వ‌యం విజ‌యం సాధించింది. ఆదివారం ఫైన‌ల్లో నెద‌ర్లాండ్స్‌తో త‌ల‌ప‌డ‌నున్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)