Breaking News

భార‌త క్రికెట‌ర్లపై బాల్ ట్యాంప‌రింగ్ ఆరోపణలు.. అంపైర్‌పై కిషన్‌ ఫైర్‌?

Published on Sun, 11/03/2024 - 12:06

మెక్‌కే వేదికగా ఆ్రస్టేలియా ‘ఎ’ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’  ఓటమి పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో హైడ్రామా చోటు చేసుకుంది. టీమిండియా ఆటగాళ్లు బాల్‌ ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు.

ఇదే విష‌యంపై భార‌త జ‌ట్టును అంపైర్ బెన్ ట్రెలోర్, ష‌వాన్ క్రెగ్‌లు మంద‌లించారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సైతం తాము ఏ తప్పు చేయలేదని అంపైర్‌లతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఫీల్డ్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.

అసలేం జరిగిందంటే?
ఆఖరి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఎ విజయానికి 86 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్లు మెక్‌స్వీనీ, బ్యూ వెబ్‌స్ట‌ర్ భారత ప్లేయర్లు ఫీల్డ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో అంపైర్ షాన్ క్రెయిగ్ భారత జట్టుకు కొత్త బంతిని అందించాడు.

అయితే బంతిని మార్చడంపై భారత ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారు. 'మీరు బంతిని స్క్రాచ్ చేశారు. కాబట్టి మేం బాల్‌ను మార్చాం. దీనిపై ఇక ఎలాంటి చర్చ లేదు. ఆట కొనసాగించండి' అంటూ అంపైర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదంతా స్టంప్ మైక్రోఫోన్‌లో రికార్డు అయింది. అయితే అంపైర్ వ్యాఖ్యలకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఘాటుగా బదులిచ్చాడు. "మేము ఏమీ చేయ‌లేదు. మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం’’ అని అన్నాడు. ఈ క్ర‌మంలో కిష‌న్‌పై అంపైర్ అగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. మీపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. మీ జట్టు చేసిన పనికి బంతిని మార్చాం'' అని అంపైర్ పేర్కొన్నాడు.

క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 
ఇక ఈవివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భార‌త ఆట‌గాళ్లు ఎవ‌రూ ఎటువంటి బాల్ టాంపరింగ్ పాల్ప‌డ‌లేదు.  పూర్తిగా దెబ్బ‌తిన్న‌డం వ‌ల్ల‌నే బంతిని మార్చాల్సి  వ‌చ్చింది. ఈ విష‌యం నాలుగో రోజు ఆట‌కు ముందే ఇరు జ‌ట్ల కెప్టెన్‌, మేనేజర్‌కు తెలియ‌జేశారు. ఈ వివాదంపై త‌దుప‌రిగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోబడవు" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.
చదవండి: IND vs NZ: ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్.. అసలు ఆ షాట్ అవసరమా? వీడియో
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు