Breaking News

లంకతో మూడో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్‌

Published on Sat, 01/07/2023 - 12:46

IND VS SL 3rd T20: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 7) జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో చహల్‌ (73 మ్యాచ్‌ల్లో 88) మరో 3 వికెట్లు తీస్తే, భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ పేరిట ఉంది. భువీ.. 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్‌ వెటరన్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ (107 మ్యాచ్‌ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్‌ అల్‌ హసన్‌ (109 మ్యాచ్‌ల్లో 128), రషీద్‌ ఖాన్‌ (74 మ్యాచ్‌ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా, శ్రీలంక చెరో మ్యాచ్‌ గెలువగా, ఇవాళ జరుగబోయే మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన శుభ్‌మన్‌ గిల్‌, అర్షదీప్‌ స్థానాల్లో రుతురాజ్‌, ముకేశ్‌ కుమార్‌ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. లంక విషయానికొస్తే.. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే యధాతథంగా కొనసాగవచ్చు. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్‌ గైక్వాడ్‌/శుబ్‌మన్‌ గిల్, సూర్యకుమార్ యాదవ్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, అక్షర్‌ పటేల్, చహల్, ముఖేశ్‌ కుమార్‌/అర్ష్‌దీప్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌. 

శ్రీలంక: దసున్‌ షనక (కెప్టెన్‌), పాతుమ్‌ నిసాంక, కుశాల్‌ మెండిస్, చరిత్‌ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్‌ తీక్షణ, దిల్షాన్‌ మదుషంక, కసున్‌ రజిత. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)