సంజూ శాంసన్‌ను ఏకి పారేసిన లిటిల్‌ మాస్టర్‌

Published on Wed, 01/04/2023 - 17:14

టీమిండియా వికెట్‌కీపర్‌ సంజూ శాంసన్‌ను భారత మాజీ కెప్టెన్‌, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఏకి పారేశాడు. ముంబై వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 3) జరిగిన తొలి టీ20లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనందుకు గాను శాంసన్‌పై నిప్పులు చెరిగాడు. ఎంత టాలెంట్‌ ఉన్నా ఏం ప్రయోజనం.. చెత్త షాట్‌ సెలెక్షన్‌తో మరోసారి వికెట్‌ పారేసుకున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. తొలి టీ20లో శాంసన్‌ చెత్త షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్న వెంటనే సన్నీ ఈ రకంగా స్పందించాడు.  

ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్‌ ఆగ్రహానికి గురయ్యాడు.  

ఇదిలా ఉంటే, భీభత్సమైన టాలెంట్‌ ఉన్నా సంజూ శాంసన్‌కు టీమిండియాలో సరైన అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపుతున్నారంటూ గత కొంతకాలంగా అతని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూపై సునీల్‌ గవాస్కర్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)