Breaking News

సూర్యకుమార్‌ సుడిగాలి శతకం.. ప్రపంచ రికార్డు సమం 

Published on Thu, 12/14/2023 - 22:35

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన స్కై.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ రికార్డును మ్యాక్స్‌వెల్‌, రోహిత్‌ శర్మ సంయుక్తంగా షేర్‌ చేసుకోగా.. తాజాగా స్కై ఈ ఇద్దరి సరసన చేరాడు.

స్కైకు ఈ రికార్డు సాధించేందుకు కేవలం 57 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరం​ కాగా.. మ్యాక్స్‌వెల్‌ 92 ఇన్నింగ్స్‌ల్లో, రోహిత్‌ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు (29/2) బరిలోకి దిగిన స్కై.. తొలి 25 బంతుల్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయిన సూర్యకుమార్‌.. ఆతర్వాతి 31 బంతుల్లో ఏకంగా 73 పరుగులు పిండుకుని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కై తన కెరీర్‌లో చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వేర్వేరు దేశాల్లో (భారత్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా) చేసినవి కావడం విశేషం.  

కాగా, సూర్యకుమార్‌ యాదవ్‌ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్‌ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో స్కై, యవస్వి మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి