అరుదైన ఘనత సాధించిన కేఎల్‌ రాహుల్‌.. 14 ఏళ్ల తర్వాత..!

Published on Thu, 12/21/2023 - 18:29

టీమిండియా తాత్కాలిక సారధి కేఎల్‌ రాహుల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 21) జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 21 పరుగులు చేసిన రాహుల్‌ 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్‌లో (వన్డేల్లో) 1000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల క్రితం ఈ ఫీట్‌ను టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోని సాధించాడు. 

కాగా, సౌతాఫ్రికాతో మూడో వన్డేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆచితూచి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు రజత్‌ పాటిదార్‌ (22), సాయి సుదర్శన్‌లతో (10) పాటు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (21) ఔట్‌ కాగా.. సంజూ శాంసన్‌ (44), తిలక్‌ వర్మ (6) క్రీజ్‌లో ఉన్నారు. 25 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 113/3గా ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్‌, హెండ్రిక్స్‌, ముల్దర్‌లకు తలో వికెట్‌ దక్కింది.

మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్‌ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగ్గా, తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో 1-1తో సమంగా ముగిసింది. వన్డే సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగనుంది. డిసెంబర్‌ 26న తొలి టెస్ట్‌.. వచ్చే ఏడాది జనవరి 3న రెండో టెస్ట్‌ ప్రారంభమవుతాయి. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)