Breaking News

ధ్రువ్ జురెల్ సూప‌ర్ సెంచ‌రీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

Published on Sat, 11/08/2025 - 16:09

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ఫామ్‌ను క‌న‌బ‌రిస్తున్నాడు. సౌతాఫ్రికా-తో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భార‌త-ఎ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జురెల్ సెంచ‌రీల మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో త‌న సూప‌ర్ జెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్న జురెల్‌.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ శ‌త‌క్కొట్టాడు. 

జురెల్ 159 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో త‌న ఆరువ ఫ‌స్ట్ క్లాస్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. తొలుత హర్ష్‌ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధ్రువ్‌.. ఆ తర్వాత కెప్టెన్‌ పంత్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జురెల్‌ ఓవరాల్‌గా 169 బంతులు ఎదుర్కొన్న జురెల్‌.. 15 ఫోర్లు, ఒక​ సిక్సర్‌తో 127 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌..
ఇక ఇండియా-ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 382-7 వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 34 పరుగుల ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 416 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇక భారత బ్యాటర్లలో జురెల్‌తో పాటు రిషబ్‌ పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

తొలుత రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగిన పంత్‌.. దూబే ఔటయ్యాక మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈసారి మాత్రం పంత్‌ చెలరేగిపోయాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఒకుహ్లే సెలె మూడు వికెట్లు పడగొట్టగా.. షెపో మోరెకి, వుర్రెన్‌, సుబ్రెయిన్‌, సిమండ్స్‌ తలా వికెట్‌ సాధించారు.

అంతకుముందు సఫారీ ‘ఎ’ జట్టు 47.3 ఓవర్లలో 221 పరుగుల వద్ద ఆలౌటైంది. మొత్తం 11 మందిలో ఏకంగా 8 మంది బ్యాటర్లు సెనొక్వనే (0), జుబేర్‌ హమ్జా (8), బవుమా (0), ఎస్తర్‌హ్యుజెన్‌ (0), టియాన్‌ వాన్‌ (6), కైల్‌ సిమండ్స్‌ (5), షెపొ మొరెకి (4 నాటౌట్‌), ఒకులె సెలె (0)లను భారత సీమర్లు సింగిల్‌ డిజిట్‌కే కట్టడి చేశారు. 

భారత పేస్‌ త్రయం ప్రసిధ్‌ కృష్ణ (3/35), ఆకాశ్‌ దీప్‌ (2/28), సిరాజ్‌ (2/61) నిప్పులు చెరిగారు.  ప్రోటీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మార్కెస్‌ అకెర్మన్‌ (118 బంతుల్లో 113; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)