Breaking News

విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీ.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

Published on Wed, 12/03/2025 - 16:22

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్‌ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆరంభంలోనే రోహిత్‌ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్‌కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి ఓ వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌..
వ‌న్డేల్లో అత్య‌ధిక సార్లు 150కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యంలో పాలుపంచుకున్న‌ ఆట‌గాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు 32 సార్లు 150కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని మ‌రొక ఆట‌గాడితో క‌లిసి నెల‌కొల్పాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ వ‌ర‌ల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

టీమిండియా భారీ స్కోరు
ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. తద్వారా సఫారీ జట్టుకు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా భారత బ్యాటర్లలో కోహ్లి, రుతురాజ్‌ సెంచరీలు కొట్టగా.. తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మెరుపు అర్ధ శతకం (43 బంతుల్లో 66 నాటౌట్‌) సాధించాడు.


 

 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)