రాణించిన భార‌త బౌల‌ర్లు.. 241 పరుగులకు పాక్ ఆలౌట్‌

Published on Sun, 02/23/2025 - 18:44

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 41.4 ఓవ‌ర్ల‌లో 241 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్ల‌తో స‌త్తాచాటాడు

ఫ‌స్ట్ స్పెల్‌లో వికెట్ లెస్‌గా వెనుదిరిగిన కుల్దీప్‌.. త‌న రెండో స్పెల్‌లో మాత్రం అద‌ర‌గొట్టాడు. అత‌డితో హార్దిక్ పాండ్యా సైతం బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మంచి ట‌చ్‌లో క‌న్పించిన పాక్ ఓపెన‌ర్ బాబ‌ర్ ఆజంను హార్దిక్ ఔట్ చేసి భార‌త్‌కు తొలి వికెట్‌ను అందించాడు.

అదే విధంగా హాఫ్ సెంచ‌రీతో మెరిసిన సౌద్ షకీల్‌ను కూడా పాండ్యానే పెవిలియ‌న్‌కు పంపాడు. ఓవరాల్‌గా 8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పాండ్యా.. కేవలం 31 పరుగులిచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలా వికెట్‌ సాధించారు.

ఇక పాకిస్తాన్ బ్యాటర్లలో సౌద్‌ షకీల్‌(76 బంతుల్లో 5ఫోర్లతో 62) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(46), కుష్దీల్‌​ షా(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మరి 242 పరుగుల టార్గెట్‌ను భారత్ సునాయసంగా ఛేదిస్తుందో లేదా పాక్ డిఫెండ్ చేసుకుంటుందో వేచి చూడాలి.
చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్‌ చర్యకు హర్షిత్‌ రాణా రియాక్షన్‌ వైరల్‌.. గంభీర్‌ కూడా!
 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)