Breaking News

సచిన్‌ రి​కార్డు బద్దలు.. సెంచరీ తర్వాత కోహ్లి ఏం చేశాడంటే? వీడియో వైరల్‌

Published on Wed, 11/15/2023 - 19:07

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కింగ్‌ కోహ్లి రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై తన 50వ సెంచరీ మార్క్‌ను అందుకున్న కోహ్లి.. ఈ అరుదైన ఘనతన తన పేరిటి లిఖించుకున్నాడు.

వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సచిన్‌ స్టేడియం వచ్చాడు. ఈ అరుదైన ఘనతను  సచిన్‌ సమక్షంలోనే కోహ్లి సాధించాడు. ఇక విరాట్‌ సెంచరీ మార్క్‌ను అందుకోగానే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అంతా కోహ్లికి స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు.

విరాట్‌ మాత్రం ఈ ఘనతను అందుకోగానే.. గాల్లోకి జంప్‌ చేస్తూ సచిన్ వైపుగా చూస్తూ బొడౌన్ చేస్తూ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. ఎన్ని ఘనతలు అందుకున్నా నీ తర్వాతే నేను అన్నట్టుగా కోహ్లి రియాక్షన్‌ ఇచ్చాడు. సచిన్‌ కూడా నిలుచుని చప్పట్లు కొడుతూ కోహ్లిని అభినందించాడు.

అదేవిధంగా గ్యాలరీలో వున్న తన సతీమణి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 113 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు.
చదవండి: World Cup 2023: శ్రేయస్‌ అయ్యర్‌ సరికొత్త చరిత్ర.. వరల్డ్‌కప్‌ నాకౌట్స్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)