Breaking News

అయ్యో తిల‌క్.. సెంచరీ బాదినా చోటు దక్కలేదే?

Published on Sun, 01/04/2026 - 09:28

విజయ్‌హజారే వన్డే ట్రోఫీ 2025-26లో హైద‌రాబాద్ ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టింది. శ‌నివారం రాజ్‌కోట్ వేదిక‌గా చండీగ‌ఢ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 136 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని హైద‌రాబాద్ అందుకుంది.  టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 

ఓపెనర్లు అమన్‌ రావు (13), తన్మయ్‌ అగర్వాల్‌ (16) విఫలం కాగా, అరంభంలోనే నిష్క్ర‌మించ‌గా.. అభిరత్‌ రెడ్డి (64 బంతుల్లో 71; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి  తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. మరో ఎండ్‌లో ఇతర బ్యాటర్లు విఫలమైనా...పట్టుదలగా ఆడిన తిలక్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఓవ‌రాల్‌గా తిల‌క్ 118 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 109 ప‌రుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన చండీగఢ్‌ 37.4 ఓవర్లలో 150 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ సంయమ్‌ సైనీ (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా...సీవీ మిలింద్, నితీశ్‌ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.

తిల‌క్‌కు నో ఛాన్స్‌..
తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న‌ప్ప‌టికి న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్ తిరిగి రావ‌డంతో తిల‌క్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌పై సెలెక్ట‌ర్లు వేటు వేశారు.

వీరిద్ద‌రూ సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో భార‌త త‌రపున ఆడారు. వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలో తిల‌క్ ఆడిన‌ప్ప‌టికి.. బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు. తిల‌క్ టీ20ల‌తో పాటు లిస్ట్‌-ఎ క్రికెట్‌లో కూడా దుమ్ములేపుతున్నాడు. కానీ జ‌ట్టు కూర్పు దృష్ట్యా అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.

కివీస్‌తో వన్డేలకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్‌, అర్ష్‌దీప్‌
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)