Breaking News

విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన బ్రేస్‌వెల్‌..

Published on Wed, 01/18/2023 - 21:26

3 వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. ఓ దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుండగా, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (60 బంతుల్లో 106 నాటౌట్‌; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో టీమిండియాను గడగడలాడిస్తున్నాడు.

అతనికి జతగా మరో ఎండ్‌లో మిచెల్‌ సాంట్నర్‌ (40 బంతుల్లో 52 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) కూడా చెలరేగుతుండటంతో టీమిండియా డిఫెన్స్‌లో పడింది. 44 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ గెలవాలంటే 36 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 57 బంతుల్లో శతకం పూర్తి చేసిన బ్రేస్‌వెల్‌.. న్యూజిలాండ్‌ తరఫున వన్డేల్లో మూడో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

రోహిత్‌ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్‌ (31), హార్ధిక్‌ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్‌ కోహ్లి (8), ఇషాన్‌ కిషన్‌ (5), వాషింగ్టన్‌ సుందర్‌ (12), శార్దూల్‌ ఠాకూర్‌ (3) నిరాశపరిచారు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్‌ మిచెల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌, టిక్నర్‌, సాంట్నర్‌, తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)