Breaking News

ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్‌ నాయర్‌

Published on Fri, 05/30/2025 - 19:43

దేశవాలీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు భారత జట్టులో చోటు సంపాదించిన కరుణ్‌ నాయర్‌.. ఇంగ్లండ్‌ పర్యటనలో తన తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌, భారత్‌-ఏ మధ్య ఇవాళ (మే 30) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో కరుణ్‌ అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కరుణ్‌ 85 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 

ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ కమ్‌ కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కరుణ్‌ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్‌ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. జైస్వాల్‌ ఔటయ్యాక ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యతను కరుణ్‌ నాయర్‌ తీసుకున్నాడు. 

కరుణ్‌.. సర్ఫరాజ్‌ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా తీసుకెళ్తున్నాడు. 44 ఓవర్ల అనంతరం భారత జట్టు స్కోర్‌ 158/2గా ఉంది. కరుణ్‌ 66, సర్ఫరాజ్‌ 48 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, కరుణ్‌ నాయర్‌కు ఇంగ్లండ్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కౌంటీలు ఆడిన కరుణ్‌.. 21 ఇన్నింగ్స్‌ల్లో ఓ డబుల్‌ సెంచరీ, ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 1025 పరుగులు చేశాడు.

2024 అక్టోబర్‌ నుంచి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో కరుణ్‌ స్కోర్లు.. 
66* (ప్రస్తుత మ్యాచ్‌), 135, 86, 6, 45, 29, 122, 105, 3, 4, 39, 123, 85

ఇదిలా ఉంటే, 33 ఏళ్ల కరుణ్‌ నాయర్‌ ఐపీఎల్‌ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడాడు. ఈ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే కరుణ్‌ ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. 

ఈ మ్యాచ్‌ మినహా కరుణ్‌ ఈ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా దేశవాలీ క్రికెట్‌లో ట్రాక్‌ రికార్డు కారణంగా కరుణ్‌కు ఇంగ్లండ్‌ టూర్‌కు పిలుపు అందింది. ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లకు, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లకు కరుణ్‌ ఎంపికయ్యాడు.

గతేడాది కాలంగా భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో కరుణ్‌ పేరు మార్మోగిపోతుంది. ఈ మధ్యకాలంలో అతను ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు.

ఈ ఏడాది విజయ్‌ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.

ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్‌ అదే జోష్‌ను  కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో  57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.

కరుణ్‌ అరివీర భయంకరమైన ఫామ్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.

ఇవే కాక కరుణ్‌ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్‌ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.

కరుణ్‌ గతేడాది కౌంటీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ దేశవాలీ సీజన్‌లో కరుణ్‌ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ సహా మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)