Breaking News

మురళీథరన్‌ రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్‌

Published on Mon, 03/11/2024 - 20:39

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఈ ప్రదర్శనతో దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీథరన్‌ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఇందులో ఓ రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టెస్ట్‌ సిరీస్‌లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు అత్యధిక సార్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మురళీథరన్‌ పేరిట ఉండిన ఈ రికార్డును అశ్విన్‌ బద్దలుకొట్టాడు.

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక​ వికెట్లు (800) సాధించిన మురళీ తన టెస్ట్‌ కెరీర్‌లో (ఓ టెస్ట్‌ సిరీస్‌లో) 25 అంతకంటే ఎక్కువ వికెట్ల ఘనతను ఆరు సార్లు నమోదు చేయగా.. అశ్విన్‌ ఏడు సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు. కేవలం 100 టెస్ట్‌ల్లోనే 516 వికెట్లు (36 ఐదు వికెట్ల ఘనతలు) తీసిన అశ్విన్‌.. మరో 285 వికెట్లు తీస్తే మురళీథరన్‌ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొడతాడు. 

కాగా, ధర్మశాల వేదికగా జరిగిన టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌.. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్‌ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో యాష్‌ రెండు ఐదు వికెట్ల ఘనతలు, ఓ నాలుగు వికెట్ల ఘనత నమోదు చేశాడు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య