Breaking News

Ind Vs Eng: ‘అక్కడ పులి.. ఇక్కడ పిల్లి’?.. ఖేల్‌ ఖతమే ఇక!

Published on Mon, 02/26/2024 - 11:47

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో కూడా పూర్తిగా నిరాశపరిచి మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

కాగా ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రజత్‌ పాటిదార్‌.. దేశవాళీ క్రికెట్‌లో సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్‌ ఎట్టకేలకు 2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ముప్పై ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇప్పటి వరకు ఆడింది ఒకే ఒక్క వన్డే. సాధించిన స్కోరు 22. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ సందర్భంగా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి జట్టుకు దూరంగా ఉండటంతో అతడి స్థానంలో రజత్‌ పాటిదార్‌కు అవకాశం వచ్చింది.

ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా టీమిండియా టెస్టు క్యాప్‌ అందుకున్న పాటిదార్‌.. ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 32, 9 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టులోనూ ఆడే అవకాశం దక్కించుకున్న అతడు రాజ్‌కోట్‌(5,0)లో పూర్తిగా విఫలమయ్యాడు.

అయినప్పటికీ రాంచి టెస్టులో కూడా పాటిదార్‌కు ఛాన్స్‌ ఇచ్చింది మేనేజ్‌మెంట్‌. అయితే, ఇక్కడా పాత కథనే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేయగలిగిన పాటిదార్‌.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. తప్పక రాణించాల్సిన మ్యాచ్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి పాటిదార్‌ ఈ మేరకు విఫలమయ్యాడు.

ఈ మూడు మ్యాచ్‌లలోనూ రజత్‌ పాటిదార్‌ స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకుని వికెట్‌ సమర్పించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘ఆర్సీబీలో పులి.. టీమిండియాలో పిల్లి’’ అన్న చందంగా పాటిదార్‌ ఆట తీరు ఉందని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. 

వరుస అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇకనైనా పాటిదార్‌ను తప్పించి అతడి స్థానంలో అర్హుడైన ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)