Breaking News

IND Vs ENG: భారత్‌ను ముంచిన బ్యాటర్లు

Published on Wed, 01/29/2025 - 02:46

ఇంగ్లండ్‌ స్కోరు 7 వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. కానీ రెండో వికెట్‌ 83 పరుగుల వద్ద పడింది. అప్పటికి 9 ఓవర్లే ముగిశాయి. ఇలా పుంజుకున్న ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను వరుణ్‌ చక్రవర్తి (5/24) తిప్పేయడంతో అనూహ్యంగా 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. హమ్మయ్య పట్టు సాధించామనుకుంటే... డెత్‌ ఓవర్లు, మిగతా బౌలర్ల వైఫల్యంతో ఇంగ్లండ్‌ 170 పైచిలుకు పరుగులు చేసింది. కానీ భారత్‌ మొదటి వికెట్‌ 16 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాతా పడిపోతూనే 85/5 స్కోరు వద్ద సగం వికెట్లను సమరి్పంచుకొని ఓటమికి స్వాగతం పలికింది. దీంతో తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సత్తా చాటితే... ఈ ఒక్కటి గెలిస్తే సిరీస్‌ వశమయ్యే మ్యాచ్‌లో నిలువెత్తు నిర్లక్ష్యం భారత్‌ను ముంచింది.  

రాజ్‌కోట్‌: సిరీస్‌ను గెలిపించే మ్యాచ్‌ను భారత్‌ సిరీయస్‌గా తీసుకున్నట్లు లేదు. అందుకే తగిన మూల్యం ఓటమిగా చెల్లించుకుంది. రేసులో నిలవాలనుకున్న ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్‌... వరుణ్‌ బిగించిన స్పిన్‌ ఉచ్చు నుంచి బయటపడి... అనంతరం ఆతిథ్య జట్టును బంతితో ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఫలితంగా సిరీస్‌ రేసులో నిలిచేందుకు ఇంగ్లండ్‌ 26 పరుగులతో భారత్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టేసింది. ముందుగా ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

బెన్‌ డకెట్‌ (28 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్‌ (24 బంతుల్లో 43; 1 ఫోర్, 5 సిక్స్‌లు) మెరిపించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తి (5/24) తిప్పేశాడు. హార్దిక్‌ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. హార్దిక్‌ పాండ్యా (40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు.   

లివింగ్‌స్టోన్‌ భారీ సిక్సర్లు 
సాల్ట్‌ (5)ను పాండ్యా త్వరగానే పెవిలియన్‌ చేర్చాడు. కానీ డకెట్, బట్లర్‌ (24; 1 ఫోర్, 1 సిక్స్‌) ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను గాడిన పెడితే వరుణ్‌ ఉచ్చులో ఇంగ్లండ్‌ చిక్కుకుంది. బట్లర్‌ సహా, స్మిత్‌ (6), ఓవర్టన్‌ (0), కార్స్‌ (3), ఆర్చర్‌ (0)లు వికెట్లు పారేసుకున్నారు. కానీ లివింగ్‌స్టోన్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో కూలుతున్న పర్యాటక జట్టు కోలుకుంది. 127/8 నుంచి 171/9 స్కోరుకు చేరుకుంది.  

లక్ష్యంపై నిర్లక్ష్యం! 
భారత్‌ ముందున్నది సాధారణ లక్ష్యం కానేకాదు. ఇలాంటి ఛేదనకు చక్కని శుభారంభం, తదనంతరం మిడిలార్డర్‌ బాధ్యత ఎంతో ముఖ్యం... కానీ ఈ ఒక్కటీ ఓడితే పోయేదేముంది అన్నట్లు భారత బ్యాటర్ల ఆటతీరు సాగింది. సంజూ సామ్సన్‌ (3), అభిషేక్‌ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు), కెప్టెన్‌ సూర్యకుమార్‌ (14), తిలక్‌ వర్మ (18), సుందర్‌ (6), అక్షర్‌ (15), జురేల్‌ (2) ఇలా అంతా... మా వల్లకాదంటూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. హార్దిక్‌ చేసిన ఆ మాత్రం స్కోరు భారత్‌ పరువు నిలిపింది... కానీ ఒడ్డున పడేయలేకపోయింది.  

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) అభిషేక్‌ (బి) పాండ్యా 5; డకెట్‌ (సి) అభిషేక్‌ (బి) అక్షర్‌ 51; బట్లర్‌ (సి) సామ్సన్‌ (బి) వరుణ్‌ 24; హ్యారీ బ్రూక్‌ (బి) బిష్ణోయ్‌ 8; లివింగ్‌స్టోన్‌ (సి) జురేల్‌ (బి) పాండ్యా 43; స్మిత్‌ (సి) జురేల్‌ (బి) వరుణ్‌ 6; ఓవర్టన్‌ (బి) వరుణ్‌ 0; కార్స్‌ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్‌ 3; ఆర్చర్‌ (బి) వరుణ్‌ 0; రషీద్‌ నాటౌట్‌ 10; మార్క్‌వుడ్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171.

వికెట్ల పతనం: 1–7, 2–83, 3–87, 4–108, 5–115, 6–115, 7–127, 8–127, 9–147. బౌలింగ్‌: షమీ 3–0–25–0, హార్దిక్‌ పాండ్యా 4–0–33–2, సుందర్‌ 1–0–15–0, వరుణ్‌ 4–0– 24–5, రవి బిష్ణోయ్‌ 4–0–46–1, అక్షర్‌ పటేల్‌ 3–0–19–1, అభిషేక్‌ 1–0–4–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) రషీద్‌ (బి) ఆర్చర్‌ 3; అభిషేక్‌ (సి) ఆర్చర్‌ (బి) కార్స్‌ 24; సూర్య (సి) సాల్ట్‌ (బి) వుడ్‌ 14; తిలక్‌ వర్మ (బి) రషీద్‌ 18; హార్దిక్‌ పాండ్యా (సి) బట్లర్‌ (బి) ఓవర్టన్‌ 40; సుందర్‌ (సి) బట్లర్‌ (బి) ఓవర్టన్‌ 6; అక్షర్‌ (సి) రషీద్‌ (బి) ఆర్చర్‌ 15; జురేల్‌ (సి) సాల్ట్‌ (బి) కార్స్‌ 2; షమీ (సి) బ్రూక్‌ (బి) ఓవర్టన్‌ 7; రవి బిష్ణోయ్‌ నాటౌట్‌ 4; వరుణ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.
వికెట్ల పతనం: 1–16, 2–31, 3–48, 4–68, 5–85, 6–123, 7–131, 8–140, 9–140. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–33–2, వుడ్‌ 3–0–29–1, బ్రైడన్‌ కార్స్‌ 4–0–28–2, లివింగ్‌స్టోన్‌ 1–0–11–0, రషీద్‌ 4–0–15–1, జేమీ ఓవర్టన్‌ 4–0–24–3.   

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)