Breaking News

గౌతమ్‌ గంభీర్‌పై విమర్శల వర్షం

Published on Wed, 06/25/2025 - 21:11

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత (2024, జూన్‌) బాధ్యతలు చేపట్టాడు. రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి గంభీర్‌ బాధ్యతలు స్వీకరించాడు. ద్రవిడ్‌ ఆథ్వర్యంలో భారత్‌ టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ద్రవిడ్‌ వారసుడిగా అప్పటికే కేకేఆర్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ (మెంటార్‌) అందించిన గంభీర్‌ రావడంతో టీమిండియాపై అంచనాలు భారీగా పెరిగాయి. మూడు ఫార్మాట్లలో భారత్‌కు తిరుగుండదని అందరూ భావించారు.

అయితే అంచనాలు తారుమారయ్యాయి. గంభీర్‌ ఆథ్వర్యంలో టీమిండియా టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ రెండు వరుస విజయాలతో  తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తొలి రెండు విజయాలు బంగ్లాదేశ్‌పై సాధించినవి కావడంతో వాటికి అంత ప్రాముఖ్యత దక్కలేదు.

అయితే గంభీర్‌కు అసలు పరీక్ష మూడో టెస్ట్‌ నుంచి మొదలైంది. భారత్‌ స్వదేశంలో ఇంగ్లండ్‌ చేతిలో వరుసగా మూడు టెస్ట్‌ల్లో ఓడింది. ఇక్కడి నుంచే గంభీర్‌పై విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించడంతో గంభీర్‌ విజయ ప్రస్తానం మొదలైందని అంతా అనుకున్నారు. 

అయితే గంభీర్‌ విజయ పరంపర కేవలం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మూడో టెస్ట్‌ డ్రా కాగా.. నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా వరుసగా పరాజయాలు చవిచూసింది.

తాజాగా ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితో భారత్‌ గంభీర్‌ ఆథ్వర్యంలో హ్యాట్రిక్‌ పరాజయాలను మూటగట్టుకుంది. గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉండగా.. భారత్‌ 11 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో కేవలం​ మూడే విజయాలు సాధించింది. ఒకటి డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట పరాజయాలు ఎదుర్కొంది. 

వరుస వైఫల్యాల నేపథ్యంలో గంభీర్‌పై విమర్శలు ధాటి బాగా పెరిగింది. ద్రవిడ్‌ హయాంలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా.. గంభీర్‌ వచ్చాక అదఃపాతాళానికి పడిపోయిందని భారత క్రికెట్‌ అభిమానులే అంటున్నారు. గంభీర్‌ వచ్చాక  టీమిండియాలో రాజకీయాలు ఎక్కువయ్యాయని, అందుకే ఈ పరాజయాలు పరంపర అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

గంభీర్‌ తన తీరును మార్చుకోకపోతే టీమిండియా ఇంగ్లండ్‌లో వైట్‌వాష్‌ తప్పదని జోస్యం చెబుతున్నారు. గంభీర్‌ రాజకీయాలు మాని జట్టును గెలుపు బాట పట్టించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. గంభీర్‌ ఇదే ధోరణిని కొనసాగిస్తే.. భారత్‌కు టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద పరాజయాలు పరంపర తప్పదని హెచ్చరిస్తున్నారు. 

1967-68లో భారత్‌ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ఇప్పటికే హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొన్న భారత్‌.. ఇంగ్లండ్‌ చేతిలో వైట్‌ వాష్‌ అయితే ఆ రికార్డును సమం చేస్తుంది. ప్రస్తుతం టీమిండియా గంభీర్‌ ఆథ్వర్యంలో గత 9 మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించి, మరో అపవాదును మూటగట్టుకుంది. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)