Breaking News

టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌!

Published on Sun, 01/29/2023 - 16:15

డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9-మార్చి 13 వరకు సిరీస్‌ జరగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

అయితే తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గాయపడిన ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌  కామెరాన్ గ్రీన్ తన చేతి వేలి గాయం నుంచి పూర్తిగా ఇంకా కోలుకోలేదు.

అయితే గ్రీన్‌ ప్రస్తుతం నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పటికీ, బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో గ్రీన్‌ గాయం సంబంధించిన రిపోర్ట్‌లను వైద్యబృందం పరిశీలించాక తుది నిర్ణయం తీసుకున్నానమని ఆసీస్‌ హెడ్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్ తెలిపారు.

"గ్రీన్‌ చేతి వేలి గాయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోనున్నాం. అతడి రిపోర్టులు వచ్చాక ఓ నిర్ణయం తీసుకోనున్నాం. నాకు తెలిసినంతవరకు అతడు బ్యాటింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. బౌలింగ్ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నాను.

అయితే అతడు మా జట్టులో స్పెషలిస్టు బ్యాటర్‌. కాబట్టి మేము తొలి ప్రాధన్యత అతడి బ్యాటింగ్‌కే ఇస్తాము. అయితే తొలి టెస్టుకు ఇంకా మాకు చాలా సమయం ఉంది. అతడు పూర్తి స్థాయిలో కోలుకుని తిరిగి జట్టులో చేరతాడని ఆశిస్తున్నాను" అని మెక్‌డొనాల్డ్ విలేకురల సమావేశంలో పేర్కొన్నాడు.
చదవండి: 'హార్దిక్ వద్దు.. టీమిండియా వన్డే కెప్టెన్సీకి వారిద్దరే సరైనోళ్లు'

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)