Breaking News

IND Vs AUS: భారత్‌తో ఐదో టెస్టు.. ఆసీస్‌ తుది జట్టు ప్రకటన! స్టార్‌ ప్లేయర్‌పై వేటు

Published on Thu, 01/02/2025 - 09:05

బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీ 2024-25పై ఆతిథ్య ఆస్ట్రేలియా క‌న్నేసింది. సిడ్నీ వేదిక‌గా జ‌న‌వరి 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాల‌ని ఆసీస్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ క్ర‌మంలో సిడ్నీ టెస్టుకు త‌మ తుది జ‌ట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది.

వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన స్టార్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్‌పై జ‌ట్టు ఆసీస్ టీమ్‌ మెనెజ్‌మెంట్ వేటు వేసింది. అత‌డి స్ధానంలో బ్యూ వెబ్‌స్టర్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఈ మ్యాచ్‌తో వెబ్‌స్ట‌ర్ అంత‌ర్జాతీయ అరంగేట్రం చేయ‌నున్నాడు.

వెబ్‌స్టర్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన బ్యూ వెబ్‌స్టర్ 5297 పరుగులతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి తుది జట్టులో చోటు ఇచ్చారు.

మ‌రోవైపు నాలుగో టెస్టులో పక్కటెముకల నొప్పితో బాధ‌ప‌డ్డ స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ తిరిగి త‌న ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో ఐదో టెస్టులో కూడా స్టార్క్ ఆడ‌నున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా మిగితా ఆసీస్‌ జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఆసీస్‌ ఉంది. ఆఖరి టెస్టులో ఆసీస్‌ గెలిస్తే సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌​ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
చదవండి: IND vs AUS 5th Test: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్‌కు గాయం
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)