‘ఎందుకింత నిర్లక్ష్యం?’.. కుల్దీప్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్‌!

Published on Tue, 03/04/2025 - 19:43

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy).. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌.. అసలే ఆస్ట్రేలియా.. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకునే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదువలేదు. అలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నపుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. 

ముఖ్యంగా ఫీల్డింగ్‌ చేస్తున్నపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ప్రతీ పరుగు ఎంతో విలువైనది. సింగిలే కదా అని వదిలేస్తే అదే మన పాలిట శాపంగా మారవచ్చు. 

అందుకే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma), స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli).. భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చేసిన తప్పిదాన్ని సహించలేకపోయారు. మైదానంలోనే అతడిపై ఈ ఇద్దరు తిట్ల దండకం అందుకున్నారు.

ఎందుకింత నిర్లక్ష్యం? మండిపడ్డ దిగ్గజాలు
‘ఎందుకింత నిర్లక్ష్యం’ అన్నట్లుగా గుడ్లు ఉరిమి చూస్తూ కుల్దీప్‌ యాదవ్‌పై ‘విరాహిత్‌’ ద్వయం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్‌తో సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా 32వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా బంతిని బాది.. అలెక్స్‌ క్యారీతో సమన్వయం చేసుకుని సింగిల్‌ కోసం వెళ్లాడు.

ఈ క్రమంలో వేగంగా కదిలిన విరాట్‌ కోహ్లి వెంటనే బంతిని కలెక్ట్‌ చేసుకుని నాన్‌- స్ట్రైకర్‌ ఎండ్‌ దగ్గర ఉన్న కుల్దీప్‌ వైపు వేశాడు. అయితే, కుల్దీప్‌ మాత్రం బంతిని అందుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. బాల్‌ దూరంగా వెళ్తున్నపుడు అలాగే చూస్తుండిపోయాడు. కనీసం దానిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బహుశా బంతి వికెట్లను తాకుతుందని అతడు అలా చేసి ఉంటాడు.

అయితే, అలా జరుగలేదు. ఇంతలో కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ వచ్చి వెంటనే బంతిని ఆపి.. ఆసీస్‌కు అదనపు పరుగు రాకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌ వైపు చూస్తూ అతడిపై మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 264 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌
కాగా దుబాయ్‌ వేదికగా ఈ సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను 264 పరుగులకు కట్టడి చేయగలిగింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ(3/48), వరుణ్‌ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ నిరాశపరిచాడు. ఎనిమిది ఓవర్ల బౌలింగ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

సెమీస్‌లో ఈ నాలుగు
ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ గ్రూప్‌ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాయి. 

ఇక పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లను నాకౌట్‌ చేసి గ్రూప్‌-‘ఎ’ నుంచి టీమిండియా, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ చేరగా.. గ్రూప్‌-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌లను ఇంటికి పంపి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టాయి. భారత్‌ మంగళవారం దుబాయ్‌ వేదికగా.. ఆసీస్‌ను నాలుగు వికె ట్ల తేడాతో ఓడించి ఫైనల్‌ చేరింది. విరాట్‌ కోహ్లి(84), శ్రేయస్‌ అయ్యర్‌(45), కేఎల్‌ రాహుల్‌(42) రాణించారు. సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ లాహోర్‌లో బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. 

చదవండి: NZ vs PAK: రిజ్వాన్‌, బాబర్‌లపై వేటు.. పాక్‌ కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)