Breaking News

IND VS AUS: రికార్డులు తిరగరాసిన బాక్సింగ్‌ డే టెస్ట్‌ మ్యాచ్‌

Published on Mon, 12/30/2024 - 20:56

మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌ మ్యాచ్‌ రికార్డులను తిరగరాసింది. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 3 లక్షల 73 వేల 691 మంది ప్రేక్షకులు (ఐదు రోజుల్లో) హాజరయ్యారు. బాక్సింగ్‌ డే టెస్ట్‌ల చరిత్రలో ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడూ హాజరుకాలేదు. 

ఈ మ్యాచ్‌ 88 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసిం​ది. 1936-37 యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌కు 3,50,534 మంది (అప్పట్లో టెస్ట్‌ మ్యాచ్‌ ఆరు రోజుల పాటు జరిగేది) హాజరయ్యారు.

ప్రేక్షకుల హాజరు పరంగా తాజాగా జరిగిన బాక్సింగ్‌ డే రెండో అత్యధికం. 1989-99లో భారత్-పాకిస్థాన్​ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌కు 4,65,000 మంది హాజరయ్యారు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే.

రోజు వారీగా బాక్సింగ్‌ డే 2024-25 టెస్ట్‌కు హాజరైన ప్రేక్షకులు..
తొలి రోజు 87,242
రెండో రోజు 85,147
మూడో రోజు 83,073
నాలుగో రోజు 43,867
ఐదో రోజు 74,363

మొత్తం 3,73,691

  • ఆస్ట్రేలియాలో ఓ టెస్ట్‌ మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య (3,73,691) కూడా ఇదే.

మ్యాచ్‌ విషయానికొస్తే.. చివరి రోజు వరకు రసవత్తరంగా సాగిన తాజా బాక్సింగ్‌ డే టెస్ట్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో ఆసీస్‌ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

తాజా బాక్సింగ్‌ డే టెస్ట్‌కు హాజరైన ప్రేక్షకులు గతానికి భిన్నంగా ఉన్నారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో జరిగే ఏ మ్యాచ్‌లోనైనా భారత ఆటగాళ్లకు ఆసీస్‌ క్రికెటర్లతో సమానమైన మద్దతు లభిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఆసీస్‌ ప్రేక్షకులు గతానికి భిన్నంగా టీమిండియాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. 

కొందరు ఆసీస్‌ అభిమానులు టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లిని టార్గెట్‌గా చేసుకుని ఓవరాక్షన్‌ చేశారు. కోహ్లి మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు.. కోహ్లి ఔటై పెవిలియన్‌కు చేరే సమయంలో కొందరు ఆసీస్‌ ప్రేక్షకులు దురుసుగా ప్రవర్తించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)