Breaking News

మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. ఆస్ట్రేలియాకు కంటితుడుపు విజయం

Published on Sun, 08/17/2025 - 11:08

ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టుతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు ఆసీస్‌కు కంటితుడుపుగా మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే కైవసం చేసుకుంది (తొలి రెండు వన్డేలు గెలిచి).

మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తడబడింది. ఆసీస్‌ బౌలర్లు తహ్లియా మెక్‌గ్రాత్‌ (8-0-40-3), అనిక లియారాయ్డ్‌ (3-0-16-2), ఎల్లా హేవర్డ్‌ (10-0-40-2), సియన్నా జింజర్‌ (8.4-0-50-2), లూసీ హ్యామిల్టన్‌ (10-2-34-1) సత్తా చాటడంతో 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (52), యస్తికా భాటియా (42) పోరాటపటిమ కనబర్చి  భారత్‌కు ఈ మాత్రం స్కోరైన అందించారు.

వీరు మినహా టీమిండియాలో ఎవరూ రాణించలేదు. నందిని కశ్యప్‌ (28), రఘవి బిస్త్‌ (18), తనుశ్రీ సర్కార్‌ (17), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (18), తనుజా కన్వర్‌ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. తేజల్‌ హసబ్నిస్‌ (1), మిన్నూ మణి (5), సైమా ఠాకోర్‌ (0), షబ్నమ్‌ షకీల్‌ (7 నాటౌట్‌) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్‌ అలిస్సా హీలీ (మిచెల్‌ స్టార్క్‌ భార్య) (84 బంతుల్లో 137 నాటౌట్‌; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి శతకంతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. ఆమెకు మరో ఓపెనర్‌ తహ్లియా విల్సన్‌ (59), రేచల్‌ ట్రెనామన్‌ (21 నాటౌట్‌) సహకరించారు.

ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో గెలుచుకుంది. టీ20ల్లో ఎదురైన పరాభవానికి భారత్‌ వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ ఆగస్ట్‌ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)