Breaking News

మెల్‌బోర్న్ టెస్టులో భారత్‌ ఓటమి

Published on Mon, 12/30/2024 - 11:54

మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టెస్టులో 184ప‌రుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.  340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి వరకు డ్రా కోసం భారత్ ప్రయత్నించినప్పటకి, ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

జైశ్వాల్ పోరాటం వృథా.. 
లక్ష్య చేధనలో ఆరంభంలోనే భారత్‌కు ఆసీస్ బౌలర్లు బిగ్ షాకిచ్చారు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా పడింది. ఈ సమయంలో యశస్వీ జైశ్వాల్‌, రిషబ్ పంత్‌​ అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొం‍టూ క్రీజులో నిలబడ్డారు. తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌.. రెండో సెషన్‌లో మాత్రం జైశ్వాల్‌, పంత్ విరోచిత పోరాటం వల్ల ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు.

 కానీ మూడో సెషన్‌లో మాత్రం ఆసీస్ బౌలర్లు తిరిగి పంజా విసిరారు. అప్పటివరకు కుదురుగా ఆడిన పంత్‌..  ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. జడేజా, నితీశ్ రెడ్డి వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి జైశ్వాల్ తన విరోచిత ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.

వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు ప్రయత్నించాడు. కానీ వివాదస్పద రీతిలో జైశ్వాల్ ఔట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో భారత్ ఓటమి లాంఛనమైంది. భారత బ్యాటర్లలో జైశ్వాల్ (208 బంతుల్లో 84) జైశ్వాల్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిషబ్ పంత్ పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 

ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్‌, కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, హెడ్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 340 పరుగుల టార్గెట్‌ను కంగారులు ఉంచారు. ఆ లక్ష్యాన్ని చేధించడంలో భారత్ చతికలపడింది. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా వేదికగా ప్రారంభం కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)