IND VS AUS 3rd T20: 35 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్‌

Published on Wed, 11/29/2023 - 12:15

గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా యంగ్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతను 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో నిదానంగా ఆడిన రుతురాజ్‌ ఆతర్వాత గేర్‌ మార్చి చెలరేగిపోయాడు. తానెదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన రుతు.. ఆతర్వాతి 35 బంతుల్లో ఏకంగా 101 పరుగులు బాదాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో రుతురాజ్‌ విధ్వంసం ఓ రేంజ్‌లో సాగింది.

ఈ ఓవర్‌లో అతను సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేయడంతో పాటు మరో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో రుతురాజ్‌ భారత్‌ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ చేసిన స్కోర్‌ (123 నాటౌట్‌) భారత్‌ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు శుభ్‌మన్‌ గిల్‌ (126 నాటౌట్‌) పేరిట ఉంది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రుతురాజ్‌ అజేయమైన మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనలో మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 104 నాటౌట్‌; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) బాది ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆసీస్‌ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్‌ (16 బంతుల్లో 28 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్‌ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్‌ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)