Breaking News

వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గోల్డన్‌ డకౌట్‌ అయిన సూర్యకుమార్‌.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Published on Wed, 03/22/2023 - 21:30

టీమిండియా విధ్వంసకర ఆటగాడు, టీ20 స్టార్‌ ప్లేయర్‌ అయిన సూర్యకుమార్‌ యాదవ్‌కు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో స్కై.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డన్‌ డకౌటయ్యాడు (తొలి బంతికే ఔట్‌). దీంతో టీమిండియా అభిమానులు సోషల్‌మీడియా వేదికగా అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో స్టార్క్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్యూ అయిన సూర్యకుమార్‌.. ఆతర్వాత విశాఖలో జరిగిన రెండో వన్డేలోనూ స్టార్క్‌ బౌలింగ్‌లోనే తొలి బంతికే ఎల్బీడబ్యూ ఔట్‌ అయ్యాడు. తొలి రెండు వన్డేల్లో ఒకే బౌలర్‌ చేతిలో ఒకేలా ఔటైన సూర్యకుమార్‌.. చెన్నై వేదికగా ఇవాళ (మార్చి 22) జరుగుతున్న మూడో వన్డేలో ఆస్టన్‌ అగర్‌ బౌలింగ్‌లో తొలి బంతికే క్లీన్‌ బౌల్డై అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. సూర్యకుమార్‌ను తక్షణమే వన్డే జట్టు నుంచి తొలగించాలని ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. కొందరేమో ఇంత నిర్లక్ష్యంగా ఆడే వ్యక్తిని టీ20 జట్టు నుంచి కూడా తప్పించాలని కోరుతున్నారు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్‌ సిరాజ్‌ (7-1-37-2), అక్షర్‌ పటేల్‌ (8-0-57-2), హార్ధిక్‌ పాండ్యా (8-0-44-3), కుల్దీప్‌ యాదవ్‌ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 42 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

రోహిత్‌ శర్మ (30), శుభ్‌మన్‌ గిల్‌ (37), కేఎల్‌ రాహుల్‌ (32), అక్షర్‌ పటేల్‌ (2), విరాట్‌ కోహ్లి (54), సూర్యకుమార్‌ యాదవ్‌ (0) ఔట్‌ కాగా.. హార్ధిక్‌ (39), జడేజా (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ గెలవాలంటే 48 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.

Videos

ఛీ..ఛీ.. చికెన్ లో కమిషన్లా !

చంద్రబాబు కు పోతిన మహేష్ వార్నింగ్

నకిలీ బంగారంతో ఘరానా మోసం

కూటమి నేతలు దిగజారిపోతున్నారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ పై సీరియస్

రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, అరెస్ట్

Exclusive Interview: నేను సంపాదించిన డబ్బులో కొంత ఛారిటీకే

పవన్ పై పిఠాపురం రైతులు ఫైర్

వల్లభనేని వంశీ కేసు కోసం ఢిల్లీ బాబాయ్ కి 2 కోట్లు ఖర్చుపెట్టారు..

భారతీయులకు ట్రంప్ మరో షాక్..

Big Question: ఏపీలో పిచ్చి కుక్కలా రెడ్ బుక్.. హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు

Photos

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)