Breaking News

ఆసీస్‌తో రెండో టెస్ట్‌కు ముం​దు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్‌ కోచ్‌

Published on Tue, 11/26/2024 - 12:19

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా 104 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) కుప్పకూలింది.

46 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (161), విరాట్‌ కోహ్లి (100 నాటౌట్‌) సెంచరీలు చేసి టీమిండియా భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడ్డారు.  

534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్‌ ఓటమి ఖరారైనా ట్రవిస్‌ హెడ్‌ (89), మిచెల్‌ మార్ష్‌ (47) కొద్దిసేపు పోరాడారు.

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి ఆసీస్‌ పరాజయానికి బాటలు వేసిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ లభించింది.

స్వదేశానికి గంభీర్‌
తొలి టెస్ట్‌లో ఘన విజయం అనంతరం టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్వదేశానికి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత గంభీర్‌ భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అతను బీసీసీఐ వద్ద అనుమతులు కూడా తీసుకున్నట్లు సమాచారం​. గంభీర్‌.. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ సమయానికి తిరిగి జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 6 నుంచి అడిలైడ్‌ వేదికగా జరుగనుంది. 

ఈ మధ్యలో భారత్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌తో రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ కాన్‌బెర్రా వేదికగా నవంబర్‌ 30, డిసెంబర్‌ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు గంభీర్‌ అందుబాటులో ఉండడు. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్ట్‌ పింక్‌ బాల్‌ టెస్ట్‌ కావడంతో ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌తో వార్మప్‌ మ్యాచ్‌ను కూడా పింక్‌ బాల్‌తోనే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడతాడు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో హిట్‌మ్యాన్‌ తొలి టెస్ట్‌కు దూరమైన విషయం తెలిసిందే.

టీమిండియాకు విందు
భారత క్రికెట్‌ జట్టు బుధవారం రోజున కాన్‌బెర్రాకు బయల్దేరనుంది. ఆ రోజు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ టీమిండియాకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ కోసం​ ఆస్ట్రేలియాకు వచ్చినందుకు గానూ భారత ఆటగాళ్లకు ఇది వెల్‌కమ్‌ పార్టీ. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)