Breaking News

ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చిత్తు

Published on Fri, 10/31/2025 - 17:13

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు మ‌రో ఓట‌మి ఎదురైంది. మెల్‌బోర్న్ వేదిక‌గా ఆసీస్‌ జ‌రిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి  దూసుకెళ్లింది. 

కాగా భార‌త్ నిర్ధేశించిన 126 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కంగారులు 6 వికెట్లు  కోల్పోయి కేవలం 13.2 ఓవ‌ర్ల‌లోనే ఊదిప‌డేశారు. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. 

కేవ‌లం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్ష్‌.. 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఎనిమిదివ ఓవర్‌లో మార్ష్‌ ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.

అతడితో పాటు ట్రావిస్‌ హెడ్‌(15 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.

అభిషేక్‌ ఒంటరి పోరాటం..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. పేసర్‌ హర్షిత్‌ రాణా (33 బంతుల్లో 35) రాణించాడు.

ఆసీస్‌ బౌలర్లలో ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్‌ బార్ట్‌లెట్‌, నాథన్‌ ఎల్లిస్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం హోబర్ట్‌ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs SA: రీఎంట్రీలో రిషభ్‌ పంత్‌ ఫెయిల్‌.. భారత్‌ ఆలౌట్‌.. .. స్కోరెంతంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)