IND VS AUS: విరాట్‌ సరసన చేరిన రింకూ

Published on Tue, 11/28/2023 - 07:56

టీమిండియా యంగ్‌ డైనమైట్‌ రింకూ సింగ్‌ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 31 పరుగులు (344.44 స్ట్రయిక్‌ రేట్‌) చేసిన రింకూ.. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో 30 అంతకంటే ఎక్కువ పరుగులు (19 లేదా 20 ఓవర్లలో)  చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో భారత్‌ తరఫున విరాట్‌ కోహ్లి మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాడు. విరాట్‌, రింకూ సింగ్‌ ఇద్దరూ రెండ్రెండు సార్లు ఈ ఘనత సాధించడం విశేషం. 

ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఘన విజయాలు సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు పేట్రేగిపోయారు.

తొలి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ (58), సూర్యకుమార్‌ యాదవ్‌ (80) మెరుపులు మెరిపించగా.. రెండో టీ20లో యశిస్వి (53), రుతురాజ్‌ (58), ఇషాన్‌ (52), రింకూ సింగ్‌ (31 నాటౌట్‌) విధ్వంసం సృష్టించారు. గౌహతి వేదికగా ఇవాళ (నవంబర్‌ 28) జరుగబోయే మూడో టీ20లో భారత బ్యాటర్లు ఇదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)