Breaking News

భారత్‌తో తొలి టెస్ట్‌.. బ్యాట్‌తో విఫలమైనా, బంతితో చెలరేగిన మైఖేల్‌ వాన్‌ తనయుడు

Published on Wed, 07/16/2025 - 07:42

భారత్‌, ఇంగ్లండ్‌ అండర్‌ 19 జట్ల మధ్య జరిగిన తొలి యూత్‌ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. బెకెన్హమ్‌లోని కెంట్‌ కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆట చివరి రోజు అయిన నాలుగో రోజు భారత్‌ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఇంగ్లండ్‌ 7 వికెట్ల నష్టానికి 270 పరుగుల స్కోర్‌ వద్ద ఆగిపోయింది. 

భారత బౌలర్లకు మరికాస్త సమయం దొరికివుంటే ఈ మ్యాచ్‌లో ఫలితం తేలిది. విజయానికి యంగ్‌ ఇండియా మరో 3 వికెట్ల దూరంలో మాత్రమే ఉండింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ సారధి హమ్జా షేక్‌ (112) అద్భుతమైన సెంచరీతో ప్రతిఘటించారు. లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్లు బెన్‌ మేస్‌ (51), థామస్‌ రూ (50) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అంబరీష్‌ 2, దేవేంద్రన్‌, అన్మోల్‌జీత్‌, విహాన్‌ మల్హోత్రా తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌటైంది. వైభవ్‌ సూర్యవంశీ (56), విహాన్‌ మల్హోత్రా (63), అంబరీష్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 32 పరుగులకు ఔటయ్యాడు.

బ్యాట్‌తో విఫలమైనా, బంతితో చెలరేగిన ఆర్చీ వాన్‌
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ దిగ్గజ బ్యాటర్‌ మైఖేల్‌ వాన్‌ తనయుడు ఆర్చీ వాన్‌ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో (2, 3) విఫలమైనా బంతితో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన వాన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

మాత్రే సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్‌ 
కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (102) సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. విహాన్‌ మల్హోత్రా (67), అభిగ్యాన్‌ కుందు (90), రాహుల్‌ కుమార్‌ (85), ఆర్‌ఎస్‌ అంబరీష్‌ (70) అర్ద సెంచరీలతో రాణించారు. వైభవ్‌ సూర్యవంశీ (14) ఈ ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు.

సెంచరీ మిస్‌ చేసుకున్న ఫ్లింటాఫ్‌ తనయుడు
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ తమ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తనయుడు రాకీ ఫ్లింటాఫ్‌ (93) సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీతో పాటు కెప్టెన్‌ హమ్జా షేక్‌ (84) సత్తా చాటారు. లోయర్‌ మిడిలార్డర్‌ ఆటగాళ్లు ఎకాంశ్‌ సింగ్‌ (59), రాల్ఫీ ఆల్బర్ట్‌ (50) అర్ద సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో హెనిల్‌ పటేల్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్‌, వైభవ్‌ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్‌ దేవేంద్రన్‌, మొహమ్మద్‌ ఎనాన్‌, విహాన్‌ మల్హోత్రా తలో వికెట్‌ తీశారు. రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ జులై 20 నుంచి ప్రారంభం​ కానుంది. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)