Breaking News

IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు.. ఆర్సీబీని ముంచేశాడు!

Published on Sat, 03/23/2024 - 06:40

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ ​బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సీఎస్‌కే ఆటగాడు శివమ్ దూబే అదరగొట్టాడు. 

ఆఖరి వరకు క్రీజులో ఉండి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. రహానే ఔటయ్యక క్రీజులోకి వచ్చిన దూబే.. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిం‍చాడు. డారిల్‌ మిచెల్ ఔటయ్యాక తన ఆటలో దూకుడు పెంచిన దూబే.. మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. 28 బంతులు ఎదుర్కొన్న దూబే.. 4 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 34 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అత‌డితో పాటు  రచిన్‌ రవీంద్ర(37) పరుగులతో అద‌ర‌గొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో అనుజ్‌ రావత్‌(48) టాప్ స్కోరర్‌గా నిలవగా..  దినేష్‌ కార్తీక్‌(38 నాటౌట్‌), డుప్లెసిస్‌(35) పరుగులతో రాణించాడు.  సీఎస్‌కే బౌలర్లలో ముస్తుఫిజర్‌ రెహ్మాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి