పోలార్డ్‌ మెరిసినా, ముంబై ఓడెన్‌..!

Published on Fri, 12/05/2025 - 07:37

దుబాయ్‌ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. నిన్న (డిసెంబర్‌ 4) గల్ఫ్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐఎ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

కెప్టెన్‌ పోలార్డ్‌ (33 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో, నికోలస్‌ పూరన్‌ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. ఆఖర్లో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (6 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించాడు. 

మిగతా బ్యాటర్లలో ముహమ్మద్‌ వసీం 1, బెయిర్‌స్టో 11, బాంటన్‌ 6, తేజిందర్‌ దిల్లాన్‌ 15, రషీద్‌ ఖాన్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. జెయింట్స్‌ బౌలర్లలో నువాన్‌ తుషార, అజ్మతుల్లా తలో 2, హైదర్‌ రజ్జాక్‌, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్‌ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పథుమ్‌ నిస్సంక (42 బంతుల్లో 81; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంకకు మొయిన్‌ అలీ (26), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (39 నాటౌట్‌) సహకరించారు. ఎంఐ బౌలర్లలో వోక్స్‌కు 2, ఘజనఫర్‌కు ఓ వికెట్‌ దక్కింది.

 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)