ముంబై ఇండియన్స్‌కు షాక్‌.. టోర్నీ నుంచి ఔట్‌

Published on Fri, 02/07/2025 - 15:10

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 టోర్నీలో (ILT20-2025) డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌కు (MI Emirates) షాక్‌ తగిలింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో నాకౌటైంది. నిన్న (ఫిబ్రవరి 7) షార్జా వారియర్జ్‌తో (Sharjah Warriorz) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. 42 పరుగులు (22 బంతుల్లో; 6 ఫోర్లు, సిక్స్‌)  చేసిన నికోలస్‌ పూరన్‌ ఎంఐ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

టామ్‌ బాంటన్‌ (29), విల్‌ జాక్స్‌ (18), కుసాల్‌ పెరీరా (18), అకీల్‌ హొసేన్‌ (15) రెండంకెల స్కోర్లు చేశారు. భారీ హిట్టర్లు ఆండ్రీ ఫ్లెచర్‌ (0), బెవాన్‌ జాకబ్స్‌ (7), రొమారియో షెపర్డ్‌ (7) దారుణంగా విఫలమయ్యారు. వారియర్జ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2, ఆడమ్‌ మిల్నే, దిల్షన్‌ మధుషంక, అస్టన్‌ అగర్‌, హర్మీత్‌ సింగ్‌, రోహన్‌ ముస్తఫా తలో వికెట్‌ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్‌ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (40), జాన్సన్‌ ఛార్లెస్‌ (36) వారియర్జ్‌ విజయానికి గట్టి పునాది వేయగా.. టిమ్‌ సీఫర్ట్‌ (40 నాటౌట్‌), రోహన్‌ ముస్తఫా (2 నాటౌట్‌) వారియర్జ్‌ను విజయతీరాలకు చేర్చారు. 

జేసన్‌ రాయ్‌ (26) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఎంఐ బౌలర్లలో ముహమ్మద్‌ రోహిద్‌ ఖాన్‌ 3, ఫజల్‌ హక్‌ ఫారూకీ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపు అనంతరం వారియర్జ్‌ రెండో క్వాలిఫయర్‌లో డెసర్ట్‌ వైపర్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేత ఫిబ్రవరి 9న జరిగే ఫైనల్లో దుబాయ్‌ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

కాగా, యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఇప్పటిదాకా రెండు ఎడిషన్లు జరిగాయి. తొలి ఎడిషన్‌లో గల్ఫ్‌ జెయింట్స్‌ ఛాంపియన్‌గా నిలువగా.. రెండో సీజన్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ విజేతగా నిలిచింది. గత ఎడిషన్‌ ఫైనల్లో ఎమిరేట్స్‌ దుబాయ్‌ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో క్యాపిటల్స్‌ అందరికంటే ముందే ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)