ILT20 2024: దుబాయ్‌ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌

Published on Tue, 12/12/2023 - 19:18

యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 టోర్నీ (DP World ILT20) రెండో ఎడిషన్‌ వచ్చే ఏడాది జనవరి 19-ఫిబ్రవరి 17 మధ్యలో జరుగనుంది. ఈ లీగ్‌ కోసం దుబాయ్‌ క్యాపిటల్స్‌ తమ నూతన కెప్టెన్‌గా ఆసీస్‌ వెటరన్‌ డేవిడ్‌ వార్నర్‌ను నియమించింది. దుబాయ్‌ క్యాపిటల్స్‌.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తుంది.

రిషబ్‌ పంత్‌ గైర్హాజరీలో వార్నర్‌ గత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వార్నర్‌తో అనుబంధాన్ని కొనసాగించడంలో భాగంగా అతనికి దుబాయ్‌ క్యాపిటల్స్‌ సారథ్య బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. అయితే వార్నర్‌ ఇంటర్నేషనల్‌ లీగ్‌ మొత్తానికి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ లీగ్‌ మొదలయ్యే సమయానికి వార్నర్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడాల్సి ఉంది. వార్నర్‌ స్వదేశీ లీగ్‌కు మధ్యలోనే హ్యాండ్‌ ఇచ్చి దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ఆడే అవకాశం ఉండదని తెలుస్తుంది. మరి ఈ రెండు లీగ్‌ల మధ్యలో వార్నర్‌ ఏ లీగ్‌కు ప్రాధాన్యత ఇస్తాడో వేచి చూడాలి. 

కాగా, ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 టోర్నీ ఇనాగురల్‌ ఎడిషన్‌లో (2023) దుబాయ్‌ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రోవ్‌మన్‌ పావెల్‌ వ్యవహరించాడు. పావెల్‌ సారథ్యంలో క్యాపిటల్స్‌ గత ఎడిషన్‌ సెమీస్‌ వరకు చేరింది. ఐఎల్‌టీ20 2023 ఎడిషన్‌ ఛాంపియన్‌గా గల్ఫ్‌ జెయింట్స్‌ నిలిచింది. ఫైనల్లో జెయింట్స్‌ డెసర్ట్‌ వైపర్స్‌ను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టులో ప్రస్తుతం రోవ్‌మన్‌ పావెల్‌, జో రూట్‌, సికందర్‌ రజా, మార్క్‌ వుడ్‌, స్టీవ్‌ స్మిత్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)