Breaking News

IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

Published on Tue, 05/06/2025 - 18:09

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌. ఈ జట్టుకు సారధిగా రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్‌ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. 

ఈ జట్టులో రాహుల్‌ త్రిపాఠి, రచిన్‌ రవీంద్ర, ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, దీపక్‌ హుడా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మతీష పతిరణ, మహ్మద్‌ షమీకి చోటు కల్పించింది. పంత్‌ను కెప్టెన్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేసింది. ఈ జట్టును నిన్న తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఎంపిక చేసిన ఈ టీమ్‌పై సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. నిజంగానే వీరు స్కామర్లు, మోసగాళ్లు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కోట్లలో డబ్బు తీసుకుని కనీస వందల విలువ చేసే ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

కొందరేమే ఆటగాళ్లు ఎలా ఆడినా ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఇలాంటి విమర్శలు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. కాగా, ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌కు ఇలాంటి వివాదాస్పద పోస్ట్‌లు చేయడం​ కొత్తేమీ కాదు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గతంలో చాలా సందర్భాల్లో వ్యంగ్యంగా స్పందించింది.

ఇదిలా ఉంటే, మోసగాళ్లు.. స్కామర్లు అంటూ ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఐపీఎల్‌ ఆటగాళ్లను విమర్శించడం సరి కాదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెడితే, ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ప్రకటించిన జట్టులోని ఆటగాళ్లుందరూ తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారన్నది కాదనలేని సత్యం. 

రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లు 20 కోట్లకు పైగా మొత్తాన్ని తీసుకున్నా కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. మిగతా ఆటగాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మ్యాక్స్‌వెల్‌, లివింగ్‌స్టోన్‌ లాంటి విదేశీ ఆటగాళ్లయితే ఏదో హాలిడేకి వచ్చామన్నట్లు ఐపీఎల్‌ను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. 

ఇషాన్‌ కిషన్‌, షమీపై వారి ఫ్రాంచైజీ ఎంతో నమ్మకముంచితే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అశ్విన్‌ అయితే తనకున్న ఘన చరిత్రను చెత్త ప్రదర్శనలతో దిగజార్చుకున్నాడు. రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా లాంటి వారు కోట్లు మింగి గల్లీ క్రికెటర్ల కంటే హీనమైన క్రికెట్‌ను ఆడుతున్నారు.

రాహుల్‌ త్రిపాఠి- 3.4 కోట్లు
రచిన్‌ రవీంద్ర- 4 కోట్లు
ఇషాన్‌ కిషన్‌- 11.25
దీపక్‌ హుడా- 1.7 కోట్లు
రిషబ్‌ పంత్‌- 27 కోట్లు
వెంకటేశ్‌ అయ్యర్‌- 23.75
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌- 4.2 కోట్లు
లియామ్‌ లివింగ్‌స్టోన్‌- 8.75 కోట్లు
రవిచంద్రన్‌ అశ్విన్‌- 9.75 కోట్లు
మతీష పతిరణ- 13 కోట్లు
మహ్మద్‌ షమీ- 10 కోట్లు

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)