Breaking News

రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్ గోల్డెన్ టికెట్..

Published on Wed, 09/20/2023 - 09:46

భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023 మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్‌లోని దిగ్గజాలకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని భారత క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్‌ అబితాబ్‌ బచ్చన్‌, భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్‌ను అందజేసింది.

తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్‌-2023 గోల్డెన్‌ టికెట్‌ను బీసీసీఐ అందించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా నేరుగా వెళ్లి గోల్డన్‌ టికెట్‌ను అందించి టోర్నీకి ఆహ్వానించారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ట్విట్‌ చేసింది.   

"బీసీసీఐ కార్యదర్శి జైషా బంగారు టిక్కెట్‌ను రజినీకాంత్‌కు అందించారు.భాషలు, సంస్కృతులకు అతీతంగా కోట్లాది మంది హృదయాల్లో దిగ్గజ నటుడు రజినీకాంత్ చెరగని ముద్రవేశారు. తలైవా విశిష్ట అతిథిగా హాజరై టోర్నీకి మరింత వెలుగు తెస్తారని తెలియజేయడానికి సంతోషం ఇస్తున్నామని" బీసీసీఐ ఎక్స్‌(ట్విటర్‌)లో రాసుకొచ్చింది. కాగా ఈ గోల్డన్‌ టిక్కెట్‌ కలిగి ఉన్న వ్యక్తులు ప్రపంచ కప్ 2023 లోని అన్ని మ్యాచ్‌లను వీఐపీ స్టాండ్ నుండి ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది.
చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్‌ ఆఫ్రిది.. హాజరైన బాబర్‌ ఆజం! ఫోటోలు వైరల్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)