వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. పాకిస్తాన్‌ మ్యాచ్‌లన్నీ అక్కడే..!

Published on Mon, 06/02/2025 - 18:39

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్‌ 2) విడుదల చేసింది.  ఈ టోర్నీకి సంబంధించిన వేదికలు, తేదీలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 5-నవంబర్‌ 2 మధ్యలో భారత్‌, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది.

భారత్‌లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్‌లు జరుగుతాయి. 

ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు ప్రేమదాస​ స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు. 

భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు హైబ్రిడ్‌ పద్దతి ప్రకారం దుబాయ్‌లో జరిగాయి. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్‌ కూడా భారత్‌లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు. భారత్‌, పాక్‌ మధ్య తాజా పరిస్థితుల (ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత) నేపథ్యంలో పాక్‌ జట్టు మన దేశంలో మ్యాచ్‌లు ఆడతామన్న భారత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు.

కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30న బెంగళూరులో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత ప్రత్యర్థి క్వాలిఫయర్‌ పోటీల ద్వారా నిర్ణయించబడుతుంది. అక్టోబర్‌ 29న తొలి సెమీఫైనల్‌ (గౌహతి లేదా కొలొంబో (పాక్‌ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్‌ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్‌ 2న ఫైనల్‌ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతుంది.

ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)