Breaking News

కెప్టెన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. బంగ్లాదేశ్‌ హ్యాట్రిక్‌

Published on Wed, 04/16/2025 - 10:29

లాహోర్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌ జట్టు విజయాల ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది. స్కాట్లాండ్‌తో మంగళవారం జరిగిన పోరులో బంగ్లాదేశ్‌ 34 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (59 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఫర్జానా (57; 6 ఫోర్లు), షర్మిన్‌ అక్తర్‌ (57; 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో క్యాథరిన్‌ బ్రైస్‌ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్‌ మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులకు పరిమితమైంది. ప్రియనాజ్‌ (63 బంతుల్లో 61; 7 ఫోర్లు), రాచెల్‌ (73 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించారు.

బంగ్లాదేశ్‌ బౌలర్లలో నహిదా 4, జన్నతుల్‌ 2 వికెట్లు తీశారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బంగ్లాదేశ్‌ 6 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 46 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ జట్టుపై గెలిచింది. 

ఇది కూడా చదవండి: 
శ్రేయస్‌ అయ్యర్‌కు ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు
దుబాయ్‌: భారత మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు మార్చి నెలకు గానూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు దక్కింది. చాంపియన్స్‌ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చినందుకుగానూ అయ్యర్‌ను ఈ పురస్కారం వరించింది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వివరాలు వెల్లడించింది. చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో అయ్యర్‌ అత్యధిక పరుగులు (243) చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్‌ ప్లేయర్లు రచిన్‌ రవీంద్ర, జాకబ్‌ డఫీ కూడా ఈ పురస్కారం కోసం పోటీపడగా... ఆ ఇద్దరినీ వెనక్కి నెడుతూ అయ్యర్‌ విజేతగా నిలిచాడు. ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. చాంపియన్స్‌ ట్రోఫీ హస్తగతం చేసుకోవడంతో పాటు అవార్డు గెలుచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఐసీసీ టోర్నీలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉంది’ అని అయ్యర్‌ అన్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారాన్ని భారత ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ దక్కించుకున్నాడు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)