Breaking News

పసికూనల మధ్య పరుగుల వరద.. అనుభవమే గెలిచింది

Published on Thu, 03/30/2023 - 07:15

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియా, పపువా న్యూ గినియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పేరుకు పసికూనలైనప్పటికి ఆటలో మాత్రం పోటాపోటీని ప్రదర్శించారు. అయితే పపువా కంటే ఎప్పుడో క్రికెట్‌లో అడుగుపెట్టిన నమీబియానే 48 పరుగులతో విజయాన్ని అందుకుంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా  నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కెప్టెన్‌ గెర్హార్‌ ఎరాస్మస్‌ (113 బంతుల్లో 125 పరుగులు), నికో డేవిన్‌(79 బంతుల్లో 90 పరుగులు), లోప్టీ ఈటన్‌(59 బంతుల్లో 61 పరుగులు) రాణించారు. పపువా న్యూ గినియా బౌలర్లలో సెమో కామియా ఐదు వికెట్లతో రాణించగా.. కాబువా మోరియా రెండు వికెట్లు తీశాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 46.2 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఆరంభం నుంచి దూకుడుగానే ఆడిన పపువా న్యూ గినియా 282/4తో పటిష్టంగా కనిపించినప్పటికి చివర్లో ఒత్తికి లోనై వికెట్లు చేజార్చుకుంది. చార్ల్స్‌ అమిని(75 బంతుల్లో 109 పరుగులు, 8 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం సరిపోలేదు. సీస్‌ బహు(44 బంతుల్లో 54 పరుగులు), కెప్టెన్‌ అసద్‌ వాలా(61 బంతుల్లో 57 పరుగులు), కిప్లిన్‌ డొరిగా(47 పరుగులు) ఆకట్టుకున్నారు. నమీబియా బౌలర్లలో బెర్నాడ్‌ స్కొల్ట్జ్‌, రూబెన్‌ ట్రంపెల్‌మన్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. గెర్హాడ్‌ ఎరాస్మస్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన గెర్హాడ్‌ ఎరాస్మస్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)