Breaking News

‘హైబ్రిడ్‌’ మోడల్‌కు అంగీకరించాల్సిందే!

Published on Sat, 11/30/2024 - 03:56

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై ‘హైబ్రిడ్‌ మోడల్‌’కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని... లేదంటే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్‌ నుంచి తరలిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్‌ జట్టు కూడా ఆడకుండా టోర్నీని జరుపుతామని కూడా తేల్చేసింది. 

చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్‌గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది! ఇందులో ఎలాంటి ఫలితం రాకపోయినా, తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్‌కు చెప్పేసింది. దుబాయ్‌లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్‌ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చారు. 

ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. భారత్‌ మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో జరిపేలా ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్‌’ మోడల్‌ను పీసీబీ ఇక్కడా తిరస్కరించింది. దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్‌ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా... ప్రస్తుత స్థితిలో ‘హైబ్రిడ్‌’ మోడల్‌కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించారు. 

దీనిని అమలు చేస్తే భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ యూఏఈలో జరుగుతాయి. ‘భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఈ విషయం పాక్‌కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడవచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న సభ్యుడొకరు వెల్లడించారు. 

టోర్నీ పాక్‌ దాటి వెళితే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే 6 మిలియన్‌ డాలర్లతోపాటు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)