Breaking News

టీ20 వరల్డ్‌కప్‌.. కామెంటేటర్ల జాబితా విడుదల

Published on Wed, 10/02/2024 - 18:28

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2024కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్‌ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్‌కప్‌ విన్నర్లు మెల్‌ జోన్స్‌, లిసా స్థాలేకర్‌, స్టేసీ ఆన్‌ కింగ్‌, లిడియా గ్రీన్‌వే, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్‌, డబ్ల్యూవీ రామన్‌, సనా మిర్‌ వరల్డ్‌కప్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. 

భారత్‌ నుంచి అంజుమ్‌ చోప్రా, మిథాలీ రాజ్‌లకు కామెంటేటర్ల ప్యానెల్‌లో చోటు దక్కింది. అంజుమ్‌, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్‌పర్ట్స్‌ ఇన్‌సైట్స్‌ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్‌లో వెటరన్లు ఇయాన్‌ బిషప్‌, కస్‌ నాయుడు, నాసిర్‌ హుసేన్‌, నతాలీ జెర్మనోస్‌, అలీసన్‌ మిచెల్‌, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్‌గోల్డ్‌రిక్‌ కూడా ఉన్నారు.

కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్‌ యూఏఈ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం​ కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 4న ఆడుతుంది. దుబాయ్‌ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. 

అక్టోబర్‌ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్‌, పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌.. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడుతుంది. గ్రూప్‌-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. 

చదవండి: Irani Cup 2024: సచిన్‌, ద్రవిడ్‌ సరసన సర్ఫరాజ్‌

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)