Breaking News

ICC Under 19 World Cup: ఆరో టైటిల్‌ లక్ష్యంగా...

Published on Fri, 01/19/2024 - 02:25

రాబోయే క్రికెట్‌లో కాబోయే స్టార్లు అయ్యేందుకు అండర్‌–19 వన్డే ప్రపంచకప్‌కు మించిన టోర్నీ ఏదీ లేదు. అంతర్జాతీయ కెరీర్‌కు కచి్చతంగా సోపానమయ్యే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు కుర్రాళ్లంతా సై అంటే సై అంటున్నారు. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఐదుసార్లు విజేత అయిన భారత జట్టు ఆరో టైటిల్‌ లక్ష్యంగా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.  

బ్లూమ్‌ఫొంటెన్‌ (దక్షిణాఫ్రికా): గతంలో యువరాజ్‌ సింగ్‌ (2000–ప్రపంచకప్‌)... ప్రస్తుతం రోహిత్‌ శర్మ (2006), కోహ్లి (2008)... ఇకపై ఇషాన్‌ కిషన్‌ (2016), గిల్‌ (2018) భారత క్రికెట్‌ చరిత్రలో బంగారు బాట వేసుకున్నారు. వీళ్లంతా అండర్‌–19 ప్రపంచకప్‌ నుంచి వెలుగులోకి వచి్చనవారే! వీళ్లే కాదు... మనీశ్‌ పాండే, ఉన్ముక్త్‌ చంద్, యశ్‌ ధుల్, మన్‌జోత్‌ కల్రా, కమలేశ్‌ నాగర్‌కోటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

క్రికెట్‌ క్రేజీ భారత్‌ను మరో స్థాయిలో నిలబెట్టారు. అందువల్లే భారత్‌ కుర్రాళ్ల మెగా ఈవెంట్‌లో ఎప్పటికప్పుడు హాట్‌ ఫేవరెట్‌గా ఉంది. ఇప్పుడు కూడా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాతో సఫారీలో ఆరో ప్రపంచకప్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను శనివారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. భారత్‌ మిగతా రెండు లీగ్‌ మ్యాచ్‌లను ఈనెల 25న ఐర్లాండ్‌తో, 28న అమెరికాతో ఆడుతుంది.

ఇదీ ఫార్మాట్‌...
ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో ఉన్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ దశలో ఒక్కో జట్టు మూడు లీగ్‌ మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు గ్రూప్‌ దశలో 24 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఓ రోజు విశ్రాంతి అనంతరం 30 నుంచి ‘సూపర్‌ సిక్స్‌’ దశ పోరు ఉంటుంది. అనంతరం ఫిబ్రవరి 6, 8 తేదీల్లో రెండు సెమీఫైనల్‌ పోటీలు జరుగుతాయి. టైటిల్‌ పోరు 11న జరుగనుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)