amp pages | Sakshi

ICC Test Rankings: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్‌1 అశూ! ఇక కోహ్లి ఏకంగా

Published on Wed, 03/15/2023 - 15:12

ICC Test Rankings- Ravichandran Ashwin- Virat Kohli: టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి నంబర్‌ 1 బౌలర్‌గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు.. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు.

తద్వారా 13వ ర్యాంకు సాధించాడు. ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ సైతం బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 44వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో సత్తా చాటి ఈ మేరకు టీమిండియా ఆటగాళ్లు ఆయా విభాగాల్లో ర్యాంకులు సాధించారు.   

ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అశ్విన్‌
సొంతగడ్డపై ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అశ్విన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 25 వికెట్లు కూల్చి టీమిండియా ట్రోఫీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. 

మొత్తంగా 25 వికెట్లు తీయడంతో పాటు 86 పరుగులు సాధించిన అశూ.. మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(22 వికెట్లు, 135 పరుగులు)తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డు పంచుకున్నాడు. 

కాగా బీజీటీ-2023 నేపథ్యంలో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టి నంబర్‌1గా అవతరించిన అశ్విన్‌.. మధ్యలో పాయింట్లు కోల్పోయి అతడితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్‌తో ఆఖరి టెస్టులో 7 వికెట్లు తీసి మళ్లీ నంబర్‌ 1 ర్యాంకు కైవసం చేసుకున్నాడు.

1205 రోజుల నిరీక్షణకు తెరదించి కోహ్లి
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రన్‌మెషీన్‌ దాదాపు మూడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. ఆసీస్‌తో ఆఖరిదైన అహ్మదాబాద్‌ మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్‌లో 75, టెస్టుల్లో 28వ శతకం సాధించాడు.

దీంతో బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్న రిషభ్‌ పంత్‌ 9, రోహిత్‌ శర్మ 10వ ర్యాంకుతో టాప్‌-10లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ బ్యాటింగ్‌ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు.

చదవండి: Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్‌ అదుర్స్‌
WTC Final: కేఎస్‌ భరత్‌ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?!

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)