Breaking News

ఆండర్సన్‌ ప్రపంచ రికార్డు! ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదమిదే!

Published on Wed, 02/22/2023 - 15:54

ICC Men's Test Bowling Rankings: ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 బౌలర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌లో మౌంట్‌ మాంగనీయ్‌లో జరిగిన తొలి టెస్టులో ఏడు వికెట్లతో సత్తా చాటి.. అగ్రస్థానానికి ఎగబాకాడు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకుకు చేరుకున్నాడు. ఆండర్సన్‌ ఈ ఫీట్‌ నమోదు చేయడం ఇది ఆరోసారి.

ఆస్ట్రేలియా కెప్టెన్‌, ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌, టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానం ఆక్రమించాడు. ఈ క్రమంలో ఆండర్సన్‌ 87 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టాడు.

87 ఏళ్ల రికార్డు బద్దలు
అత్యధిక వయసులో టెస్టు నంబర్‌ 1 బౌలర్‌గా అవతరించిన క్రికెటర్‌గా నిలిచాడు. 40 ఏళ్ల 207 రోజుల వయసులో ఈ ఫీట్‌ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం క్లారీ గ్రిమెట్‌ పేరిట ఉండేది. 1936లో 44 ఏళ్ల 2 నెలల వయసులో ఆయన ఈ ఘనత సాధించాడు. ఇక ప్రస్తుతం యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో 40 ఏళ్ల దాకా జట్టులో కొనసాగడం కాస్త కష్టమే. కాబట్టి ఇప్పటికైతే ఆండర్సన్‌ రికార్డుకు ఎసరు పెట్టేవాళ్లు లేరని చెప్పవచ్చు.

మొదటి ర్యాంకుకు అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదం
ఇక కివీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆండర్సన్‌ ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అగ్రస్థానానికి ఎగబాకి మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌తో ఆండర్సన్‌ మొదటి ర్యాంకుకు ప్రమాదం పొంచి ఉంది. 

ఇంగ్లండ్‌కు కివీస్‌తో ప్రస్తుతం మిగిలి ఉన్నది ఒకే ఒక టెస్టు. దీంతో ఆండర్సన్‌ న్యూజిలాండ్‌తో మిగిలిన మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో వేచిచూడాల్సి ఉంది. అదే సమయంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు అశ్విన్‌.

అశూకు నల్లేరు మీద నడకే
ఆసీస్‌తో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో అదీ తనకు అచ్చొచ్చిన పిచ్‌లపై ఈ స్పిన్‌ బౌలర్‌ చెలరేగడం ఖాయం. కాబట్టి స్వల్పకాలంలోనే అశ్విన్‌,.. కేవలం తనకంటే రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువగా కలిగి ఉన్న ఆండర్సన్‌ను వెనక్కినెట్టడం సులువే.

ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌తో పోటీ ఉందని భావించినా.. అతడు అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వెళ్లడం.. మళ్లీ వస్తాడో లేదో తెలియకపోవడం ర్యాంకింగ్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి అశ్విన్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్రస్థానానికి చేరుకోవడం 36 ఏళ్ల అశూకు నల్లేరు మీద నడకే!

ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. జేమ్స్‌ ఆండర్సన్‌- ఇంగ్లండ్‌- 866 పాయింట్లు
2. రవిచంద్రన్‌ అశ్విన్‌- ఇండియా- 864 పాయింట్లు
3. ప్యాట్‌ కమిన్స్‌- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు
4. ఓలీ రాబిన్సన్‌- ఇంగ్లండ్‌- 820 పాయింట్లు
5. జస్‌ప్రీత్‌ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు

చదవండి: Bumrah: ‘అలసిపోయాను సర్‌.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్‌ చేయనా?’
Women T20 WC: కీపర్‌ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్‌ 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)