Breaking News

దూసుకొచ్చిన ఇషాన్‌ కిషన్‌

Published on Thu, 02/26/2026 - 09:05

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్‌ ప్లేస్‌ దిశగా దూసుకొచ్చాడు. గత వారం ఎనిమిదో స్థానంలో ఉండిన అతను.. తాజాగా ఐదో స్థానానికి ఎగబాకాడు. వరుస వైఫల్యాల తర్వాత కూడా భారత విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అగ్రస్థానాన్ని నెలబెట్టుకున్నాడు. 

అయితే రెండో ప్లేస్‌లో ఉన్న ఫిల్‌ సాల్ట్‌కు అతనికి మధ్య పాయింట్ల వత్యాసం బాగా తగ్గింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తున్న పాక్‌ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ తన కెరీర్‌లో మొదటిసారి టాప్‌-3లోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో వరుసగా సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన ఫర్హాన్‌.. 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరాడు. 

తాజాగా సెంచరీ చేసినా లంక ఆటగాడు నిస్సంక ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయినా సూర్యకుమార్‌ యాదవ్‌ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పేలవ ఫామ్‌లో ఉన్న తిలక​ వర్మ (Tilak Varma) 3 స్థానాలు కోల్పోయి 7వ స్థానానికి పడిపోయాడు. సౌతాఫ్రిక చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఈ వారం ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా నిలిచాడు. బ్రెవిస్‌ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 9వ స్థానానికి చేరాడు.

మరిన్ని చెప్పుకోదగ్గ మార్పులు ఇవే..
హ్యారీ బ్రూక్‌- 18వ ర్యాంక్‌ (10 స్థానాలు ఎగబాకి)
శివమ్‌ దూబే- 28వ ర్యాంక్‌ (13 స్థానాలు ఎగబాకి)
షిమ్రోన్‌ హెట్‌మైర్‌- 46 (10 స్థానాలు ఎగబాకి)
షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌- 50 (8 స్థానాలు ఎగబాకి)
డేవడ్‌ మిల్లర్‌- 69 (10 స్థానాలు ఎగబాకి)
విల్‌ జాక్స్‌- 71 (21 స్థానాలు ఎగబాకి)

శ'బాష్‌'
ఈ వారం టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్‌ కార్బిన్‌ బాష్‌ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరాడు. భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టాప్‌ ప్లేస్‌ను కాపాడుకున్నాడు. వెస్టిండీస్‌ బౌలర్‌ మాథ్యూ ఫోర్డ్‌ కూడా ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందాడు. ఇతను ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా కూడా ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఓ మోస్తరుగా లబ్ది పొందాడు. 7 స్థానాలు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకాడు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3, అక్షర్‌ పటేల్‌ 10 స్థానాలు కోల్పోయి 20, 24 స్థానాలకు పడిపోయారు.

భారీగా లబ్బి పొందిన బౌలర్లు..
మార్కో జన్సెన్‌- 19వ ర్యాంక్‌ (8 స్థానాలు ఎగబాకి)
గుడకేశ్‌ మోటీ- 22 (17 స్థానాలు ఎగబాకి)
లియామ్‌ డాసన్‌- 23 (23 స్థానాలు ఎగబాకి)
ఫమార్‌ జోసఫ్‌- 54 (14 స్థానాలు ఎగబాకి)
ఉస్మాన్‌ తారిక్‌- 55 (59 స్థానాలు ఎగబాకి)
షాదాబ్‌ ఖాన్‌- 65 (10 స్థానాలు ఎగబాకి)
మొహమ్మద్‌ నబీ- 78 (37 స్థానాలు ఎగబాకి)

తిరిగి నంబర్‌ వన్‌గా 
ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే.. జింబాబ్వే ఆటగడు సికందర్‌ రజా తిరిగి తన నంబర్‌ వన్‌ పీఠాన్ని అధిరోహించాడు. పాక్‌ ఆటగాడు సైమ్‌ అయూబ్‌ను కిందకు దించి ఈ ఘనత సాధించాడు. భారత ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శివమ్‌ దూబే రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఏడో స్థానానికి చేరాడు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)