Breaking News

మెరుగుపడిన యశస్వి, గిల్‌ ర్యాంక్‌లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్‌, విరాట్‌

Published on Wed, 09/25/2024 - 14:44

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీలతో చెలరేగిన శుభ్‌మన్‌ గిల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ భారీగా ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 14, 72 స్థానాలకు చేరుకోగా.. పంత్‌ తన రేటింగ్‌ పాయింట్లను మెరుగుపర్చుకుని ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. 

గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ విరాట్‌ కోహ్లి ఈ వారం ర్యాంకింగ్స్‌లో తలో ఐదు స్థానాలు కోల్పోయి 10, 12 స్థానాలకు దిగజారారు. జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌, డారిల్‌ మిచెల్‌, స్టీవ్‌ స్మిత్‌, యశస్వి జైస్వాల్‌ టాప్‌-5 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసిన లంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య తొలిసారి టాప్‌-10లోకి వచ్చాడు. జయసూర్య ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరాడు. బంగ్లాతో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా ఓ స్థానం మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. అశ్విన్‌, బుమ్రా మొదటి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. 

లంకతో టెస్ట్‌లో రాణించిన న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరుకోగా.. అదే టెస్ట్‌లో రాణించిన కివీస్‌ పేసర్‌ విలియమ్‌ ఓరూర్కీ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ ప్లేస్‌కు చేరాడు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ టాప్‌-2గా కొనసాగుతుండగా.. అక్షర్‌ పటేల్‌ ఆరో స్థానంలో నిలిచాడు.

చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచ‌రీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)