Breaking News

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?

Published on Tue, 12/24/2024 - 17:54

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్‌ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధాకరికంగా మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.  పాకిస్తాన్‌ ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌ ఆశించినట్లే హ్రైబిడ్‌ మోడల్‌లో జరగనుంది.

భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌ వేదికగా ఆడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 9న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్‌ ఫైనల్‌ కోసం ఐసీసీ రిజర్వే డేను కేటాయించింది. పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు లాహోర్, కరాచీ  రావల్పిండి మైదానాలు ఆతిథ్యమివ్వనున్నాయి.

దాయాదుల పోరు ఎప్పుడంటే?
ఇక ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో చిరకాల ప్రత్యర్ధులు భారత్‌-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

భారత్‌ తమ చివరి లీగ్‌  ‍మ్యాచ్‌ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. కాగా గ్రూపు-ఎలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌,పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. అదే విధంగా గ్రూపు-బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా ఉన్నాయి. 

షెడ్యూల్‌ ఇదే..
ఫిబ్రవరి 19, 2025  (కరాచీ)-  పాకిస్తాన్ vs న్యూజిలాండ్
ఫిబ్రవరి 20, 2025  (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్‌
ఫిబ్రవరి 21, 2025 (కరాచీ)- ఆఫ్ఘనిస్తాన్ vs సౌత్ ఆఫ్రికా
ఫిబ్రవరి 22, 2025 (లాహోర్)- ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్
ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్‌
ఫిబ్రవరి 24, 2025 (రావల్పిండి)- బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్
ఫిబ్రవరి 25, 2025 (రావల్పిండి)- ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా
ఫిబ్రవరి 26, 2025 (లాహోర్)- ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్
ఫిబ్రవరి 27, 2025 (రావల్పిండి)- పాకిస్తాన్ vs బంగ్లాదేశ్
ఫిబ్రవరి 28, 2025 (లాహోర్)- ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా
మార్చి 1, 2025 (కరాచీ) దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్
మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత​
మార్చి 4, 2025 (దుబాయ్) సెమీ-ఫైనల్ A1 vs B2
మార్చి 5, 2025 (లాహోర్ )సెమీ-ఫైనల్ B1 vs A2
మార్చి 9, 2025 (లాహోర్) ఫైనల్
మార్చి 10, 2025 – దుబాయ్ రిజర్వ్ డే
👉ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు మొదలు కానున్నాయి.

 

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)