Breaking News

CT IND Vs PAK: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ..

Published on Thu, 02/20/2025 - 20:55

ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి పాలైన పాకిస్తాన్‌కు మ‌రో భారీ షాక్ త‌గిలింది.  కరాచీ వేదికగా కివీస్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టైన్‌ చేసినందుకు పాక్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 5 శాతం కోత విధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో పాక్‌ తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది.

దీంతో కొత్త రూల్స్ ప్రకారం.. మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పాక్ 30-యార్డ్ సర్కిల్‌లో అదనపు ఫీల్డర్‌తో ఫీల్డింగ్ చేయవలిసి వచ్చింది. దాంతో పాటుగా ఈ జరిమానా కూడా పాక్ జట్టుపైన పడింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఫిర్యాదు మెరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా తన తమ తప్పిదాన్ని రిజ్వాన్ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ కేవలం ఫైన్‌తోనే సరిపెట్టాడు.

తొలి మ్యాచ్‌లో చిత్తు..
కాగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. 321 పరుగుల లక్ష్య చేధనలో పాక్ జట్టు 260 పరుగులకు ఆలౌటైంది.  పాక్ బ్ష్‌బ్యాటర్లలో ఖుష్‌దిల్‌ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేశారు.

కివీస్ బౌలర్లలో శాంట్నర్‌, ఓ రూర్క్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ రెండు వికెట్లు సాధించాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌  50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ టామ్‌ లాథమ్‌ (104 బంతుల్లో 118 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్‌ యంగ్‌ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతకాలతో చెలరేగారు.

జమాన్ దూరం..
కాగా పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్‌​ ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే జమాన్ వైదొలగాడు. అతడి స్ధానాన్ని ఇమామ్ ఉల్ హక్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్‌తో తలపడనుంది.
చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ రికార్డు బద్దలు
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)